Bandi Sanjay Yatra : ఈ నెల 28 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర
Praja Sangrama Yatra : దిల్లీ చుట్టూ తిరిగినా.. కేసీఆర్ ను బీజేపీలో చేర్చుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కవితను ఎలా చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ తో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమేనన్నారు.
మోదీ సభతో కేసీఆర్(KCR) కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో భయం మెుదలైందని బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. నవంబర్ 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లుగా చెప్పారు. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. భైంసాలో పాదయాత్ర(Padayatra) ప్రారంభ సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్(KCR)తో ఎలాంటి యుద్ధానికైనా తాము సిద్ధమేనని బండి సంజయ్ అన్నారు.
భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తాం. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. బీజేపీ(BJP) బలోపేతం కాకుండా అడ్డుకోవాలని కేసీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్ గెలవాలని అంటున్నారు. వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లను ఏ చెప్పుతో కొట్టాలి. కేసీఆర్(KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లను అని చెబితే.. వెళ్తారని అర్థం. ఇజ్రాయెల్ టెక్నాలజీని తెలంగాణ(Telangana)కు తీసుకువచ్చింది ఎవరు. ప్రధాని మోదీ(PM Modi) పేరు చెబితే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారు.
- బండి సంజయ్
తెలంగాణ(Telangana)లోనే టీఆర్ఎస్(TRS)కు కార్యకర్తలు లేరని.. ఇక దేశం మెుత్తం ఎలా పోటీ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన సమావేశం చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ఎమ్మెల్యేలలు కూడా లేదన్నారు. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నాయకుల కబ్జాలేనని ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా సంపాదించారని, ముఖ్యమంత్రికి తెలుసన్నారు.
'డెక్కన్ కిచెన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్ దారుణంగా తయారు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ బీజేపీకి మద్దతుగా తెలిపాలి. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. పార్టీ నేతలు అమ్ముడుపోతే.. కార్యకర్తలు బీజేపీలో చేరండి. కేసీఆర్ కంటే ముందే యుద్ధం ప్రారంభించాం. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు మా టార్గెట్' అని బండి సంజయ్ అన్నారు.
సంబంధిత కథనం