Bandi Sanjay : డిసెంబర్‌ 15న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు…-bandi sanjay 5th praja sangrama yatra will end in karm nagar srr grounds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : డిసెంబర్‌ 15న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు…

Bandi Sanjay : డిసెంబర్‌ 15న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు…

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 04:39 PM IST

Bandi Sanjay తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర డిసెంబర్ 15న కరీంనగర్‌లో ముగియనుంది. కరీం నగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ గ్రౌండ్స్‌లో ప్రజా సంగ్రామమ యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. సమైక్యాంధ్ర పేరుతో తెలంగాణలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టి కేసీఆర్‌ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు
బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

Bandi Sanjay తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను డిసెంబర్‌ 15న నిర్వహించనున్నారు. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో జరగనుంది. ముగింపు సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర జనసమీకరణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ నుంచి బహిరంగ సభను గ్రాండ్ సక్సెస్ చేసి, కేసీఆర్ కు ఛాలెంజ్ విసురుతామన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుట్రలను, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, సమైక్యాంధ్ర చిచ్చు రగిల్చి, సెంటిమెంట్ తో మళ్లీ లబ్దిపొందాలని చూస్తున్నాడు

1400 మంది బలిదానం చేసుకుంటేనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్‌ ఏపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. అడ్డగోలుగా సంపాదించిన కుటుంబాన్ని కాపాడుకోడానికే, ప్రజల దృష్టి మళ్లించి, నీచ రాజకీయాల చేస్తున్నాడని ఆరోపించారు.

కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ చెల్లని రూపాయని, ఇక్కడే చెల్లని కేసీఆర్ BRS పేరుతో అక్కడ చెల్లుతాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం అంతా అవినీతిమయమని, కేసీఆర్ పేదోళ్లను అరిగోస పెడుతున్నాడని ఏ యాగం చేసినా, ఫలించదన్నారు.

గతంలో తెలంగాణలో యాగం చేసిన తర్వాత, తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేశావని ప్రశ్నించారు. ఢిల్లీలో రాజశ్యామల యాగం చేస్తే... పాపాలు పోతాయా అని నిలదీశారు. తెలంగాణ లో ఎంతమందికి డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు ఇచ్చారని, నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంత కమిషన్ దొబ్బి పోయావో.. ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశ్యామల యాగం సాక్షిగా ప్రజలకు నిజాలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

లిక్కర్ కేసులో నీ కూతురు కవిత ప్రమేయం పై ఎందుకు స్పందించడం లేదన్నారు. రాజశ్యామల యాగం సాక్షిగా నీ కూతురుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంబంధం లేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. కవిత ఇంటి దగ్గర సింహాలు...పులుల ఫోటోలు ఏమిటని నిలదీశారు. కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని, దేశంలో అవినీతి విషయంలో ఏ రాష్ట్రంలో ఏం జరిగినా సీబీఐ వెళ్లి దర్యాప్తు చేస్తుందన్నారు. సీబీఐ రావొద్ద ని చెప్పడానికి నువ్వెవరని ప్రశ్నించారు. మోడీ వచ్చేముందు ఈడీ రాదని, మోడీ వచ్చే ముందు కేటీఆర్ కు కాలు విరుగుతుందన్నారు. మోడీ వస్తే ఇంకొకరికి కరోనా వస్తుందని, 'ధరణి పేరుతో భూములు దండుకున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ని ఓడగొట్టేందుకు, కేసీఆర్ వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నారని ఆరోపించారు.