Bhadradri: సీతారాముల కళ్యాణం చూతము రారండి...-arrangements completed at bhadradri for sri rama navami celebrations 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhadradri: సీతారాముల కళ్యాణం చూతము రారండి...

Bhadradri: సీతారాముల కళ్యాణం చూతము రారండి...

Mar 29, 2023, 09:15 PM IST HT Telugu Desk
Mar 29, 2023, 09:15 PM , IST

Bhadrachala Ramayya Kalyanam: భద్రాద్రిలో శ్రీరాముల వారి కల్యాణానికి సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ అనుదీప్ వెల్లడించారు.

బుధవారం ఉదయం నుంచే భద్రాచలానికి భక్తుల రాక ప్రారంభమైందని కలెక్టర్ వెల్లడించారు. మిథిలా స్టేడియంలో ఏర్పాట్లును పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్తుల రద్దీతో భద్రాచలం సందడిగా మారిందన్నారు.  ప్రతి భక్తుడు వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.  వేడుకలు వీక్షణకు ప్రతి సెక్టార్ లో ఎల్ ఈ డి లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

(1 / 4)

సెక్టార్లలో భక్తులకు మంచినీరు,మజ్జిగ, బిస్కెట్స్ ఉచిత పంపిణీ చేస్తారు. సేవలు పర్యవేక్షణకు ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులు కేటాయింపు చేసినట్లు కలెక్టర్ వివరించారు. వైద్య సేవలు నిర్వహణకు  అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో పాటు అత్యవసర కేంద్రాల్లో మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు అందజేస్తారు.  అంబులెన్స్ లు, సిపిఆర్ సేవలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భక్తులకు సమాచారం అందించుటకు  ప్రధాన కూడళ్ళలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 

(2 / 4)

ప్రతి సమాచార కేంద్రంలో స్వామి వారి సేవలు, బస్సులు, రైళ్లు, అత్యవర వైద్య కేంద్రాలు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు వివరాలు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

(3 / 4)

ఏదైనా అత్యవసర సేవలకు భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని... భక్తులు ఫోన్ ద్వారా సహాయం పొందాలని చెప్పారు. భక్తులు జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్  సూచించారు.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు