Medchal News : మేడ్చల్ లో దారుణం - రూ.100 కోసం కాంట్రాక్టర్ ను హత్య చేసిన కార్మికుడు-a worker who killed a contractor for rs 100 in medchal malkajgiri district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medchal News : మేడ్చల్ లో దారుణం - రూ.100 కోసం కాంట్రాక్టర్ ను హత్య చేసిన కార్మికుడు

Medchal News : మేడ్చల్ లో దారుణం - రూ.100 కోసం కాంట్రాక్టర్ ను హత్య చేసిన కార్మికుడు

HT Telugu Desk HT Telugu
Jul 07, 2024 11:08 AM IST

Medchal Malkajgiri District : వంద రూపాయల కోసం ఓ కార్మికుడు హత్య చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పరిధిలో జరిగింది.

మేడ్చల్ జిల్లాలో దారుణం
మేడ్చల్ జిల్లాలో దారుణం (image source from unsplash.com)

మేడ్చల్ లో దారుణం చోటు చేసుకుంది. రూ.100 కోసం ఓ కాంట్రాక్టర్ ను బండరాయితో కొట్టి కార్మికుడు హత్య చేశాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చోటు చేసుకుంది.

మేడ్చల్ డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.... మేడ్చల్ పట్టణంలోని వెంకట్రామిరెడ్డి నగర్ కాలానికి చెందిన విభూతి పోచయ్య (45) లేబర్ వర్క్స్ కాంట్రాక్టర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోచయ్య వద్దే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ధర్మేంద్ర కార్మికుడిగా పని చేస్తున్నాడు.

ఒకరోజు కూలీ డబ్బులో పోచయ్య… ధర్మేంద్ర కు రూ.100 తక్కువగా ఇచ్చాడు. ప్రతిరోజూ లాగే శనివారం ఇద్దరు కలిసి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని చేసి…మధ్యాహ్నం పట్టణంలోని అయ్యప్ప దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశారు. భోజనం అనంతరం తనకు ఇవ్వాల్సిన రూ.100 ఇవ్వాలని… తాను మద్యం తాగాలని పోచయ్యను అడిగాడు.

రూ.100 కోసం హత్య…

ధర్మేంద్ర అడిగి వంద రూపాయాలను ఇచ్చేందుకు కాంట్రాక్టర్ పోచయ్య నిరాకరించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. గొడవ పడుతూనే వీరు ఇద్దరూ మేడ్చల్ లోని తుమ్మ చెరువు సమీపంలోని లేబర్ అడ్డాకు చేరుకున్నారు. అక్కడ ఈ గొడవ ఇంకా ముదిరింది.

ఈ నేపథ్యంలోనే కోపోద్రిక్తుడైన ధర్మేంద్ర… పోచయ్య తలపై రాయితో బలంగా కొట్టాడు. దీంతో పోచయ్య తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే రాయితో కొట్టి పరిపోదామని చూసిన ధర్మేంద్రను… స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితుడిపై కత్తితో దాడి…

బదులుగా తీసుకున్న రూ.700 లు ఇవ్వలేదన్న కోపంతో స్నేహితుడి పై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. చార్మినార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......కాలపత్తర్ ప్రాంతానికి చెందిన తాహిర్ (22) వద్ద అతని స్నేహితుడైన షేక్ అలిమ్ (24) రూ.700 లు అప్పుగా తీసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం బాయ్స్ టౌన్ పాఠశాల ప్రాంతంలో ఈ ఇద్దరు యువకులు కలుసుకున్నారు. అక్కడ రూ.700 విషయంలో మాట మాట పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాహిర్ తన స్కూటీ లో పెట్టుకున్న కత్తితో అలీమ్ పై దాడి చేశాడు. కడుపు, మెడ లో పొడిచాడు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు తాహిర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా.