Yusuf Pathan: పాకిస్థాన్ పేసర్‌కు చుక్కలు చూపించిన యూసుఫ్ పఠాన్ - ఒకే ఓవర్‌లో 25 రన్స్
Yusuf Pathan: జిమ్ ఆఫ్రో టీ10 టోర్నీలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 26 బాల్స్‌లోనే 80 రన్స్ చేశాడు. పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ వేసిన ఓవర్‌లో 25 రన్స్ రాబట్టాడు.
Yusuf Pathan: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చుక్కలు చూపించాడు. అతడు వేసిన ఓవర్‌లో 25 రన్స్ చేశాడు. టీమ్ ఇండియాకు రిటైర్‌మెంట్ ప్రకటించిన యూసుఫ్ పఠాన్ ప్రస్తుతం జిమ్ ఆఫ్రో టీ10 టోర్నీ ఆడుతోన్నాడు. జోబర్గ్‌బఫెల్లోస్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న అతడు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.
కేవలం 26 బాల్స్‌లోనే తొమ్మిది సిక్సర్లు 4 ఫోర్లతో 80 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ ఖలందర్స్ 10 ఓవర్లలో 140 రన్స్ చేసింది. ఆండ్రూ ఫ్లెచర్ 39, ఆసిఫ్ అలీ 32 రన్స్‌తో రాణించారు. 141 టార్గెట్‌లో బరిలో దిగిన జోబర్గ్ టీమ్ తడబడింది. ఐదు ఓవర్లలో కేవలం 50 పరుగులు మాత్రమే చేసింది. 30 బాల్స్‌లో 90 రన్స్ చేయాల్సిన తరుణంలో బ్యాటింగ్ దిగిన యూసుఫ్ ఫఠాన్ ఫోర్లు, సిక్సర్లతో డర్బన్ బౌలర్లను బెంబేలెత్తించాడు.
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ వేసిన ఎనిమిదో ఓవర్ లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో మొత్తం 25 రన్స్ చేశాడు. తొమ్మిదో ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్, ఆ తర్వాతి ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో యూసుఫ్ పఠాన్ జోబర్గ్ జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు.
ఆమీర్ ఓవర్‌లో అతడు 25 రన్స్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూసుఫ్ జోరుతో 141 పరుగుల టార్గెట్‌ను మరో బంతి మిగిలుండగానే జోబర్గ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో 307 స్ట్రైక్ రేట్‌తో యూసుఫ్ పఠాన్ బ్యాటింగ్ చేశాడు.
టాపిక్