Virat Kohli: తన ఫామ్‌పై ఇన్‌స్టా పోస్టుతో కోహ్లీ రిప్లయి.. ఒక్క మాటతో తేల్చేశాడు
విరాట్ కోహ్లీ ఫామ్‌పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా కోహ్లీ ఓ క్వోట్ రూపంలో తన ప్రదర్శనపై వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కింద పడినా.. పైకి లేస్తాను అనే అర్థం వచ్చేలా పోస్టు పెట్టాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు కావస్తుంది. దీంతో అభిమానులు కూడా పాత కోహ్లీని చూడాలని ఆశపడుతున్నారు. మరి ఈ ఏడాది పేలవ ఫామ్‌తో దారుణంగా విఫలమవుతున్నాడు. సెలక్టర్లు కూడా అతడిని విశ్రాంతి పేరుతో పక్కకు తప్పిస్తున్నారు. పలువురు మాజీలు సైతం అతడి ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు కోహ్లీ కూడా నోరు విప్పలేదు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ క్వోట్(Quote) రూపంలో తన స్పందనను తెలియజేశాడు. కింద పడినా.. పైకి లేచేందుకే అనే అర్థం వచ్చేలా తన పోస్టులో పేర్కొన్నాడు.
“ఒకవేళ నేను కింద పడితే ఏంటి? ఓ నా ప్రియతమా.. ఒకవేళ నేను పైకి ఎగిరితే ఏంటి?(What if I fall? Oh but my darling, what if you fly?)” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీ పోస్టు పెట్టాడు. ఈ క్యాప్షన్ ఉన్న ఇమేజ్‌ను కూడా షేర్ చేశాడు. తన మార్గాన్ని ఇంకా నమ్ముతూనే ఉన్నానని కోహ్లీ క్వోట్ రూపంలో చెప్పాడు.
ఇదిలా ఉంటే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. తన సహచర ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. అతడి ఫామ్‌పై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో బదులిస్తున్నాడు. కోహ్లీకి మద్దతుగా పాక్ కెప్టెన్ బాబర్ అజాం కూడా నిలిచాడు. ఇండియన్ స్టార్ గురించి హార్ట్ టచింగ్ ట్వీట్‌ను పోస్టు చేశాడు.
అభిమానులు, క్రీడా నిపుణులు కోహ్లీ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో విరాట్‍కు విశ్రాంతినివ్వాలని వాదించిన క్రికెట్ నిపుణులు వాదించగా.. ఇప్పుడు విరాట్ కొన్ని సిరీస్‌లనే ఎంచుకుంటున్నందుకు విమర్శిస్తున్నారు. క్రికెటర్లు విశ్రాంతి తీసుకుంటే మళ్లీ ఫామ్‌లోకి ఎలా వస్తారని ఇర్ఫాన్ పఠాన్, వెంకటేశ్ అయ్యర్ లాంటి భారత మాజీ ఆటగాళ్లు అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్‌లో ఆడుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌లో విజయం సాధించి 1-1 తేడాతో సమంగా ఉన్నాయి. నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం నాడు ప్రారంభం కానుంది.
సంబంధిత కథనం
టాపిక్