WI vs SA T20 Match: రెండు సెంచ‌రీలు - 517 ర‌న్స్ - వెస్టిండీస్, సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో రికార్డుల మోత‌-south africa record chase win over west indies in second t20 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  South Africa Record Chase Win Over West Indies In Second T20

WI vs SA T20 Match: రెండు సెంచ‌రీలు - 517 ర‌న్స్ - వెస్టిండీస్, సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో రికార్డుల మోత‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 27, 2023 07:16 AM IST

WI vs SA T20 Match: ఆదివారం వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో రికార్డుల మోత మోగింది. వెస్టిండీస్ ప్లేయ‌ర్ జాన్స‌న్ ఛార్లెస్‌తో పాటు సౌతాఫ్రికా ఓపెన‌ర్ డికాక్ మెరుపు సెంచ‌రీల‌తో ప్రేక్ష‌కుల‌కు అస‌లైన టీ20 మ‌జాను అందించారు.

డికాక్‌, హెండ్రిక్స్‌
డికాక్‌, హెండ్రిక్స్‌

WI vs SA T20 Match: ఆదివారం వెస్టిండీస్‌, సౌతాఫ్రికా మ‌ధ్య జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. రెండు జ‌ట్టు క‌లిపి 517 ప‌రుగులు చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్‌లో ప‌లు టీ20 రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 258 ప‌రుగులు చేసింది.

ట్రెండింగ్ వార్తలు

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ జాన్స‌ర్ ఛార్లెస్ 39 బాల్స్‌లోనే సెంచ‌రీ చేసి విండీస్ త‌ర‌ఫున టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ను అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో జాన్స‌న్ 46 బాల్స్‌లోనే 11 సిక్స‌ర్లు, 10 ఫోర్ల‌తో 118 ర‌న్స్ చేశాడు. ఓపెన‌ర్ మేయ‌ర్స్ 27 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, ఐదు ఫోర్ల‌తో 57, రోమ‌న్ షెఫార్డ్ 18 బాల్స్‌లో 41 ర‌న్స్‌తో మెర‌వ‌డంతో వెస్టిండీస్ 258 ప‌రుగులు చేసింది. వెస్టిండీస్ విధించిన ఈ భారీ టార్గెట్‌ను మ‌రో ఏడు బాల్స్ మిగిలుండ‌గానే సౌతాఫ్రికా ఛేదించింది.

టీ20 చ‌రిత్ర‌లో ఇదే హ‌య్యెస్ట్ ఛేజింగ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఓపెన‌ర్ డికాక్ మెరుపు సెంచ‌రీతో సౌతాఫ్రికాకు స్ట‌న్నింగ్ విక్ట‌రీని అందించాడు. 43 బాల్స్‌లోనే సెంచ‌రీ మార్కును అందుకున్నాడు. సౌతాఫ్రికా త‌ర‌ఫున టీ20ల్లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన రెండో క్రికెట‌ర్‌గా నిలిచాడు. మొత్తంగా 44 బాల్స్ ఎదుర్కొన్న డికాక్ ఎనిమిది సిక్స‌ర్లు, తొమ్మిది ఫోర్ల‌తో 100 ర‌న్స్ చేశాడు.

డికాక్‌తో పాటు హెండ్రిక్స్ 28 బాల్స్‌లో 2 సిక్స‌ర్లు, 11 ఫోర్ల‌తో 68 ర‌న్స్ తో రాణించ‌డంతో ప‌ది ఓవ‌ర్ల‌లోనే సౌతాఫ్రికా 149 ప‌రుగులు చేసింది. టీ20 హిస్ట‌రీలో తొలి ప‌ది ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన జ‌ట్టుగా సౌతాఫ్రికా రికార్డ్ క్రియేట్ చేసింది. మార్‌క్ర‌మ్‌, రూసో కూడా ధ‌నాధ‌న్ షాట్స్ ఆడ‌టంతో 18.5 ఓవ‌ర్ల‌లోనే సౌతాఫ్రికా 259 ప‌రుగులు చేసింది.

ఈ టీ20 మ్యాచ్‌లో న‌మోదైన ఇత‌ర రికార్డులు

ఈ మ్యాచ్‌లో డికాక్ 15 బాల్స్‌లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. టీ20 క్రికెట్‌లో సౌతాఫ్రికా త‌ర‌ఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ చేసిన క్రికెట‌ర్‌గా డికాక్ నిలిచాడు.

ప‌వ‌ర్ ప్లేలో సౌతాఫ్రికా 102 ప‌రుగులు చేసింది. ప‌వ‌ర్ ప్లేలో ఓ టీమ్ చేసిన హ‌య్యెస్ట్ స్కోర్ ఇదే.

ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌, సౌతాఫ్రికా క‌లిపి 517 ర‌న్స్ చేశాడు. టీ20 మ్యాచ్‌లో రెండు టీమ్‌లు క‌లిపి చేసిన అత్య‌ధిక స్కోర్ ఇదే.

WhatsApp channel