virat kohli: బాబర్ ట్వీట్ పై కోహ్లి స్పందిస్తాడని అనుకోవడం లేదు: షాహిద్ అఫ్రిది
విరాట్ కోహ్లి (virat kohli)కి మద్ధతుగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ (babar azam) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్ పై పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు ఏమన్నాడంటే...
ప్రస్తుతం విరాట్ కోహ్లి ఫామ్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు పలువురు సీనియర్లు క్రికెటర్లు కోహ్లిపై విమర్శలు సంధిస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తో పాటు ఇతర క్రికెటర్లు కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే కఠిన పరిస్థితులు తొలగిపోతాయని ధైర్యంగా ఉండమంటూ కోహ్లిని సపోర్ట్ చేస్తూ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ గురువారం ట్వీట్ చేశాడు. తన ట్వీట్ తో కోహ్లి అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు.
పాకిస్థాన్, ఇండియా మధ్య సరైన సంబంధాలు లేకపోయినా దాయాది దేశానికి చెందిన ఆటగాడికి మద్దతు నిచ్చిన బాబర్ అజామ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బాబర్ ట్వీట్ పై పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ ట్వీట్ పై కోహ్లి స్పందిస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆటగాడికి మద్ధతుగా బాబర్ అద్భుతంగా స్పందించాడని అన్నాడు.
కానీ కోహ్లి వైపు నుండి రిప్లై వచ్చిందో లేదో తెలియదని తెలిపాడు. అతడు స్పందిస్తే బాగుండేదని అన్నాడు. బాబర్ ట్వీట్ కు విరాట్ రిప్లై ఇస్తాడని తాను అనుకోవడం లేదని అఫ్రిది పేర్కొన్నాడు. అతడి కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ట్వీట్ పై బాబర్ స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లికి సపోర్ట్ అవసరమని, అందుకే ట్వీట్ చేసినట్లు పేర్కొన్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కోహ్లికి మద్దతుగా నిలిచాడు.
సంబంధిత కథనం
టాపిక్