Manjrekar About Mushfiqur: ముష్ఫీకర్ వికెట్ పడగొట్టడమే మలుపు.. బంగ్లాతో తొలి టెస్టుపై మంజ్రేకర్ వ్యాఖ్యలు-sanjay manjrekar says musfiqur rahim wicket was an important one in india vs bangladesh test ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sanjay Manjrekar Says Musfiqur Rahim Wicket Was An Important One In India Vs Bangladesh Test

Manjrekar About Mushfiqur: ముష్ఫీకర్ వికెట్ పడగొట్టడమే మలుపు.. బంగ్లాతో తొలి టెస్టుపై మంజ్రేకర్ వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Dec 17, 2022 09:29 PM IST

Manjrekar About Mushfiqur: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫీకర్‌ను ఔట్ చేయడమే మలుపని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశారు.

ముష్ఫీకర్ రహీమ్
ముష్ఫీకర్ రహీమ్ (AFP)

Manjrekar About Mushfiqur: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు భిగించింది. ఇంకా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. మరోపక్క బంగ్లా గెలవాలంటే 241 పరుగులు చేయాల్సి ఉంది. అయితే నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి 124 పరుగులకే వికెట్లేమి కోల్పోకుండా పటిష్ఠ స్థితిలో ఉన్న బంగ్లాదేశ్.. అక్షర్ పటేల్ తిప్పేయడంతో 272 పరుగుల కల్లా 6 వికెట్లతో కష్టాల్లో పడింది. బంగ్లా ప్రదర్శనపై తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. ముష్పీకర్ రహీమ్ వికెట్ తీయడమే టర్నింగ్ కీలకమైందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

"ముష్పీకర్ వికెట్ భారత్‌కు చాలా ముఖ్యమైంది. అతడు కానీ ఔట్ కాకుండా క్రీజులోనే ఉండుంటే నురుల్, మెహదీ అంత త్వరగా వచ్చే వారు కాదు. అతడు ఉండటం వల్ల బంగ్లాదేశ్‌ విజయానికి కొంచెం ఎక్కువ అవకాశముండేది. అయితే ముష్ఫీకర్ ఔట్ కావడం. బంగ్లా గెలిచే అవకాశాలు క్లిష్టతరమయ్యాయి." అని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

షకీబుల్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. "దూకుడుగా ఆడిన షకీబ్‌ను చూస్తుంటే.. అతడు డ్రా కోసం కాకుండా గెలుపు కోసమే ఆడినట్లుంది. మెహదీ హసన్‌తో కలిసి అతడు ఇప్పపటికే 34 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ వద్ద సరిపోయినన్నీ బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. సిరాజ్, ఉమేశ్ యాదవ్ లాంటీ పేసర్లతో పాటు స్పిన్ విషయంలో అక్షర్, కుల్దీప్, అశ్విన్ లాంటి మెరుగైన బౌలింగ్ వనరులు ఉన్నాయి." అని మంజ్రేకర్ అన్నారు.

513 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు 102 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. చివరిదైన ఐదో రోజు బంగ్లా విజయానికి ఇంకా 241 పరుగులు అవసరం కాగా.. భారత్ మాత్ర మరో నాలుగు వికెట్లు తీస్తే సరిపోతుంది. అయితే తోక తెంచడంలో మాత్రం ఇబ్బంది పడుతోంది టీమిండియా.

WhatsApp channel

సంబంధిత కథనం