Sania Mirza Retirement : హైదరాబాద్‌లో ఆరేళ్ల బాలికగా వెళ్లా.. సానియా మీర్జా ఎమోషనల్ పోస్ట్
Sania Mirza Retirement : భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్‌మెంట్‌పై మరోసారి కామెంట్స్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నందున ఎమోషనల్ పోస్ట్ చేసింది.
వచ్చే నెల దుబాయ్ మాస్టర్స్ తర్వాత రిటైర్ కానున్న సానియా మీర్జా(Sania Mirza), తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ అయిన 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ముందు ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసింది. తన సుదీర్ఘమైన కేరీర్ గురించి చెప్పుకొచ్చింది. తనకు లభించిన మద్దతుకు, రాబోయే టోర్నమెంట్ కోసం తన ఉత్సాహం గురించి తెలిపింది. మీర్జా రిటైర్ మెంట్ తో టెన్నిస్ లో ఒక శకానికి ముగింపు పలికినట్టవుతుంది. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత ఇంటర్‌నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించనుంది.
'30 సంవత్సరాల క్రితం హైదరాబాద్(Hyderabad)లోని NASR పాఠశాల నుండి 6 సంవత్సరాల బాలిక, తన తల్లితో కలిసి నిజాం క్లబ్‌లోని టెన్నిస్ కోర్ట్‌కు వెళ్లింది. నేర్చుకునేందుకు కోచ్‌తో పోరాడింది. టెన్నిస్(Tennis) ఎలా ఆడాలి అని మెుదలుపెట్టింది. కలల కోసం పోరాటం 6 సంవత్సరాలప్పుడే ప్రారంభమైంది.' అని సానియా పోస్ట్ చేసింది.
తన గ్రాండ్‌స్లామ్ ప్రయాణం 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో ప్రారంభమైందని, కెరీర్‌ని ముగించడానికి ఇదే అత్యుత్తమ గ్రాండ్‌స్లామ్ అని చెప్పనవసరం లేదని సానియా అభిప్రాయపడింది. మొదటిసారి ఆడిన 18 సంవత్సరాల తర్వాత తన చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. తన వృత్తిపరమైన కెరీర్‌లో 20 సంవత్సరాలుగా సాధించగలిగిన ప్రతిదానికీ గర్వపడుతున్నాని సానియా మిర్జా తెలిపింది. తాను సృష్టించగలిగిన జ్ఞాపకాలతో కృతజ్ఞతతో ఉంటానని పేర్కొంది. 'నేను విజయాన్ని సాధించి, నా సుదీర్ఘ కెరీర్‌లో మైలురాళ్లను చేరుకున్న ప్రతిసారీ నా దేశం వారు, నా మద్దతుదారుల ముఖాల్లో నేను చూసిన గర్వం, సంతోషం జీవితకాలం నాతో పాటు ఉండే గొప్ప జ్ఞాపకం.' అని సానియా మిర్జా(Sania Mirza) పేర్కొంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చివరి టోర్నీ ఆడబోతున్నట్లు తెలిపింది. గాయాల కారణంగా 2022లోనే సానియా మీర్జా టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరిగింది. మోచేతి గాయంతో గత ఏడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. ఆ తర్వాత మైదానంలో సానియా అడుగుపెట్టలేదు. తరచుగా గాయాలు ఇబ్బంది పెట్టడంతో ఆటకు దూరం కావాలని అనుకున్న ఆమె ఆ తర్వాత తన నిర్ణయాన్ని వాయిదావేసింది.
దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరుగనున్న డబ్ల్యూటీఏ(WTA) 1000 టోర్నమెంట్ తర్వాత తాను టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్టు సానియా మీర్జా పేర్కొంది. కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు డబుల్స్ గ్లాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నది సానియా మీర్జా. అంతే కాకుండా డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది.
సింగిల్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌లో నిలిచిన సానియా మీర్జా గాయాల కారణంగా ఆ తర్వాత డబుల్స్ కు మాత్రమే పరిమితమైంది.
సంబంధిత కథనం