Sania Mirza Retirement: రిటైర్‌మెంట్‌పై సానియా మీర్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - అదే చివరి టోర్నమెంట్
Sania Mirza Retirement: భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా రిటైర్‌మెంట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తాను టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించింది.
Sania Mirza Retirement: భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నది. తన రిటైర్‌మెంట్‌పై సానియా మీర్జా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత ఇంటర్‌నేషనల్ కెరీర్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది.
సానియా మీర్జా రిటైర్‌మెంట్‌పై చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తోన్నాయి. తన రిటైర్‌మెంట్ గురించి ఇటీవల ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా మీర్జా క్లారిటీ ఇచ్చేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చివరి టోర్నీ ఆడబోతున్నట్లు తెలిపింది. గాయాల కారణంగా 2022లోనే సానియా మీర్జా టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు ప్రచారం జరిగింది. మోచేతి గాయంతో గత ఏడాది యూఎస్ ఓపెన్‌కు దూరమైంది. ఆ తర్వాత మైదానంలో సానియా ఆడుగుపెట్టలేదు. తరచుగా గాయాలు ఇబ్బంది పెట్టడంతో ఆటకు దూరం కావాలని అనుకున్న ఆమె ఆ తర్వాత తన నిర్ణయాన్ని వాయిదావేసింది.
ఈ జనవరిలో జరుగనున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్లాండ్‌స్లామ్ డబుల్స్‌లో బరిలో దిగనుంది. ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కజకిస్థాన్ ప్లేయర్ అన్నా డనిలీనాతో తో కలిసి సానియా ఆడబోతున్నది. అంతర్జాతీయ కెరీర్‌లోసానియా మీర్జాకు ఇదే చివరి గ్లాండ్ స్లామ్ టోర్నీ కావడం గమనార్హం.
దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరుగనున్న డబ్ల్యూటీఏ 1000 టోర్నమెంట్ తర్వాత తాను టెన్నిస్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోనున్నట్లు సానియా మీర్జా పేర్కొన్నది. కెరీర్‌లో ఇప్పటివరకు ఆరు డబుల్స్ గ్లాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నది సానియా మీర్జా. అంతే కాకుండా డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచంది.
సింగిల్స్‌లో కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌లో నిలిచిన సానియా మీర్జా గాయాల కారణంగా ఆ తర్వాత డబుల్స్ కు మాత్రమే పరిమితమైంది.
టాపిక్