Covid positive in IPL | దిల్లీ క్యాంపులో మరో కరోనా కేసు.. ఈ సారి కోచ్‌పై ప్రభావం
దిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. ఈ సారి ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి సోకింది. ప్రస్తుతానికి వారిని ఐసోలేషన్‌లో చికిత్స చేస్తున్నారు.
గత రెండు ఐపీఎల్ సీజన్లపై కరోనా మహమ్మారి తన ప్రభావం చూపించి.. అభిమానులకు తగినంత సందడి, వినోదం అందలేదు. ఈ సారైన కోవిడ్ నుంచి ఉపశమనం పొందామనుకునేలోపే మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే దిల్లీ క్యాపిటల్స్ జట్టులో పలువురికి కోవిడ్ పాజిటివ్ రాగా.. తాజాగా మరో వ్యక్తి ఈ జాబితాలో చేరారు. దిల్లీ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సదరు ఐపీఎల్ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటన ద్వారా తెలియజేసింది.
"దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ కుటుంబానికి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాం. పాంటింగ్‌కు ఇప్పటికే రెండు సార్లు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ జట్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనను కూడా మరో ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచుతున్నాం. కాబట్టి శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ పాంటింగ్ అందుబాటులో ఉండడు. కాబట్టి పాంటింగ్‌తో పాటు అతడి కుటుంబ గోప్యతకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాం." అని దిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది.
బయో బబుల్‌లో ఉండి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే విధంగా ఐసోలేషన్‌లో ఉంచామి దిల్లీ క్యాపిటల్ నిర్వాహకులు తెలిపారు. వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, త్వరగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
బుధవారం పంజాబ్-దిల్లీ మధ్య మ్యాచ్ సందర్భంగా దిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆరో వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగా రాజస్థాన్-దిల్లీ మ్యాచ్‌ను ముంబయి నుంచి పుణెకు షిఫ్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన దిల్లీ క్యాపిటల్స్ మూడింటిలో నెగ్గి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్