Ravindra Jadeja With Injury: టీమిండియాకు షాక్.. ఆసియా కప్‌ నుంచి జడేజా దూరం-ravindra jadeja ruled out with injury and he will replaced by axar patel ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ravindra Jadeja Ruled Out With Injury And He Will Replaced By Axar Patel

Ravindra Jadeja With Injury: టీమిండియాకు షాక్.. ఆసియా కప్‌ నుంచి జడేజా దూరం

Maragani Govardhan HT Telugu
Sep 02, 2022 06:40 PM IST

Ravindra Jadeja Injury: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గాయమైంది. దీంతో అతడు ఆసియా కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (REUTERS)

Jadeja ruled Out with Injury: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టోర్నీకి దూరం కానున్నాడు. కుడి మోకాలు గాయం కావడంతో అతడు జట్టు నుంచి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు శుక్రవారం నాడు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేసింది. జడేజా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. జడ్డూ స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకుంటున్న స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

"ఆసియా కప్‌లో ఆల్ ఇండియా సెలక్షన్ కమిటీ జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశమిచ్చింది. రవీంద్ర జడేజాకు కుడి మోకాలికి గాయం కావడంతో అతడు టోర్నీకి దూరం కానున్నాడు. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నాం. ఇంతకుముందు అక్షర్ పటేల్ స్టాండ్‌బైగా తీసుకున్నాం. వీలైనంత త్వరలో దుబాయ్‌లో భారత జట్టుతో అక్షర్ కలవనున్నాడు." అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 35 పరుగులతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో వికెట్లేమి తీయలేదు. అంతేకాకుండా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ ఆడే అవకాశం రాలేదు.

ఆసియా కప్‌లో ఇప్పటికే టీమిండియా పాకిస్థాన్, హాంకాంగ్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి సూపర్-4 దశకు చేరుకున్నాయి. సెప్టెంబరు 4న ఆదివారం నాడు ఈ రెండు జట్లలో గెలిచిన జట్టుతో భారత్ అమీ తుమీ తేల్చుకోనుంది.

ఆసియా కప్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్, రవి భిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్.

WhatsApp channel

సంబంధిత కథనం