Suresh Raina | 'మిస్టర్‌ ఐపీఎల్‌'ను లైట్‌ తీసుకున్న ఫ్రాంఛైజీలు.. రైనా ఔట్-mister ipl suresh raina out of league as franchises ignore him in the auction ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Suresh Raina | 'మిస్టర్‌ ఐపీఎల్‌'ను లైట్‌ తీసుకున్న ఫ్రాంఛైజీలు.. రైనా ఔట్

Suresh Raina | 'మిస్టర్‌ ఐపీఎల్‌'ను లైట్‌ తీసుకున్న ఫ్రాంఛైజీలు.. రైనా ఔట్

Hari Prasad S HT Telugu
Feb 14, 2022 07:55 AM IST

రైనా అంటే ఐపీఎల్‌.. ఐపీఎల్‌ అంటే రైనా అనేంతగా ఈ లీగ్‌పై ముద్ర వేశాడు సురేశ్‌ రైనా. అందుకే అతనికి మిస్టర్‌ ఐపీఎల్‌ అని పేరు. కానీ అంతటి రైనాను కూడా నిర్దాక్షిణ్యంగా లైట్‌ తీసుకున్నాయి ఫ్రాంఛైజీలు.

<p>సురేశ్ రైనా</p>
సురేశ్ రైనా (Twitter)

బెంగళూరు: ఐపీఎల్‌ వేలంలో తొలి రోజు సురేశ్‌ రైనాను తీసుకోవడానికి ఫ్రాంఛైజీలు నిరాకరించినప్పుడు.. మరో రోజు ఉంది కదా అని అతని అభిమానులు సర్ది చెప్పుకున్నారు. కానీ రెండో రోజు వేలం మొత్తం ముగియక ముందే అతనిక ఐపీఎల్‌లో ఆడబోడని తేలిపోయింది. 

ఆక్సిలరేటెడ్‌ ఆక్షన్‌లో ఫ్రాంఛైజీలు 69 మంది ప్లేయర్స్‌ పేర్లు ఇచ్చినప్పుడు అందులో రైనా పేరు లేదు. అప్పుడే అతన్ని ఫ్రాంఛైజీలు లైట్‌ తీసుకున్నాయని అర్థమైపోయింది. లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అతడు ఆడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా రైనాను పట్టించుకోలేదు. మొదట అతన్ని రిటేన్‌ చేసుకోవడానికి ఇష్టపడని సీఎస్కే.. వేలంలోనూ చూసీచూడనట్లు వదిలేసింది. 

ఐపీఎల్‌లో 200కుపైగా మ్యాచ్‌లు, 5 వేలకుపైగా రన్స్‌ చేసిన అనుభవం రైనా సొంతం. 2020లో కరోనా భయం కారణంగా తొలిసారి రైనా ఐపీఎల్‌ నుంచి తనకు తానుగా తప్పుకోగా.. ఈసారి ఫ్రాంఛైజీలే అతన్ని తప్పించాయి. గతేడాది అతడు ఫర్వాలేదనిపించినా.. చివర్లో ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్‌లు ఆడలేదు. 2016, 2017లలో చెన్నై టీమ్‌పై నిషేధం విధించిన సమయంలో మాత్రమే రైనా అప్పటి కొత్త టీమ్‌ గుజరాత్‌ లయన్స్‌కు కెప్టెన్‌గా ఆడాడు. మిగతా అన్ని సీజన్లలోనూ చెన్నైతోనే ఉన్నాడు.

ఐపీఎల్‌లో రైనా ఘనతలు ఇవీ

మొత్తం 205 మ్యాచ్‌లు.. 5528 పరుగులు

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో నాలుగోస్థానం

1 సెంచరీ, 39 హాఫ్‌ సెంచరీలు

ఐపీఎల్‌లో 5000 రన్స్‌ చేసిన తొలి బ్యాటర్‌

అత్యధిక క్యాచ్‌లు - 205 మ్యాచ్‌లలో 109

సీఎస్కే తరఫున అత్యధిక హాఫ్‌ సెంచరీలు - 33

సీఎస్కే తరఫున అత్యధిక బౌండరీలు - 425

సీఎక్కే తరఫున రెండో అత్యధిక సిక్స్‌లు - 180

Whats_app_banner

సంబంధిత కథనం