Kane Williamson steps down: న్యూజిలాండ్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్‌-kane williamson steps down as test captain of new zealand tim southee to take charge ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kane Williamson Steps Down: న్యూజిలాండ్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్‌

Kane Williamson steps down: న్యూజిలాండ్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విలియమ్సన్‌

Hari Prasad S HT Telugu
Dec 15, 2022 10:54 AM IST

Kane Williamson steps down: న్యూజిలాండ్‌ టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కేన్‌ విలియమ్సన్‌. అయితే అతడు వైట్‌ బాల్ క్రికెట్‌లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ (Getty Images)

Kane Williamson steps down: న్యూజిలాండ్‌ టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్‌గా ఉన్న కేన్‌ విలియమ్సన్‌.. తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అతని స్థానంలో టిమ్‌ సౌథీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే వైట్‌ క్రికెట్‌లో మాత్రం ఆ టీమ్‌ కెప్టెన్‌గానే కొనసాగనున్నాడు. న్యూజిలాండ్‌ తరఫున 88 టెస్టులు ఆడిన కేన్‌ విలియమ్సన్‌.. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడని న్యూజిలాండ్‌ క్రికెట్‌ గురువారం (డిసెంబర్‌ 15) వెల్లడించింది.

ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా న్యూజిలాండ్‌ను నిలిపిన ఘనత విలియమ్సన్‌ సొంతం. తొలి ఎడిషన్‌ ఫైనల్లో ఇండియాను ఓడించి న్యూజిలాండ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టెస్ట్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా.. తాను అన్ని ఫార్మాట్లలోనూ ఆడాలని అనుకుంటున్నట్లు విలియమ్సన్‌ చెప్పాడు. అతని స్థానంలో టిమ్‌ సౌథీ కెప్టెన్‌ కాగా.. వైస్‌ కెప్టెన్‌గా ఓపెనర్‌ టామ్‌ లేథమ్‌ను నియమించారు.

"బ్లాక్‌ క్యాప్స్‌కు టెస్టుల్లో కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తాను. నా వరకూ టెస్ట్‌ క్రికెటే అత్యుత్తమం. ఇందులోని సవాళ్లను నేను ఎంజాయ్‌ చేశాను. కెప్టెన్సీ ఫీల్డ్‌ లోపల, బయట భారాన్ని పెంచుతుంది. అయితే నా కెరీర్‌లో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించాను" అని న్యూజిలాండ్‌ క్రికెట్‌తో విలియమ్సన్‌ అన్నాడు.

న్యూజిలాండ్‌ను 38 టెస్టుల్లో అతడు లీడ్‌ చేశాడు. ఇందులో 22 మ్యాచ్‌లలో ఆ టీమ్‌ గెలిచింది. 10 ఓడిపోగా, 8 డ్రాగా ముగిశాయి. ఇక తాను ఆడిన 88 టెస్టుల్లో ఇప్పటి వరకూ విలియమ్సన్‌ 7368 రన్స్‌ చేశాడు. అతని సగటు 52 కావడం విశేషం. 24 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు బాదాడు. విలియమ్సన్‌ తన తొలి టెస్ట్‌ను 2010లో ఇండియాపైనే ఆడటం విశేషం.

అయితే వచ్చే రెండేళ్లలో రెండు వరల్డ్‌కప్‌లు ఉండటంతో వైట్‌ బాల్‌ క్రికెట్‌లో మాత్రం విలియమ్సన్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. కెప్టెన్‌ సౌథీ, వైస్‌ కెప్టెన్‌ లేథమ్‌లకు తన పూర్తి సపోర్ట్‌ ఉంటుందని కూడా స్పష్టం చేశాడు.

WhatsApp channel