Williamson Replacement for SRH: విలియమ్సన్‌ను భర్తీ చేసేది అతడే.. ఆరెంజీ ఆర్మీకి ఇర్ఫాన్ పఠాన్ సలహా-irfan pathan picks mayank agarwal as replacement of kane williamson for sunrisers ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Williamson Replacement For Srh: విలియమ్సన్‌ను భర్తీ చేసేది అతడే.. ఆరెంజీ ఆర్మీకి ఇర్ఫాన్ పఠాన్ సలహా

Williamson Replacement for SRH: విలియమ్సన్‌ను భర్తీ చేసేది అతడే.. ఆరెంజీ ఆర్మీకి ఇర్ఫాన్ పఠాన్ సలహా

Maragani Govardhan HT Telugu
Dec 20, 2022 09:38 AM IST

Williamson Replacement for SRH: కేన్ విలియమ్సన్‌ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వదులుకోవడంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని సూచించాడు టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. మయాంక్ అగర్వాల్ తీసుకోవాలని స్పష్టం చేశాడు.

విలియమ్సన్‌ను భర్తీ చేసేది అతడే: ఇర్ఫాన్ పఠాన్
విలియమ్సన్‌ను భర్తీ చేసేది అతడే: ఇర్ఫాన్ పఠాన్ (BCCI-AP)

Williamson Replacement for SRH: ఐపీఎల్‌ 2023 సీజన్‌కు గానూ.. డిసెంబరు 23 నుంచి మినీ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేలాన్ని ఫ్రాంఛైజీలన్నీ సక్రమంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. కొత్త ఆటగాళ్లతో తమ జట్టును మరింత బలపరచుకోవాలని భావిస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే కేన్ విలియమ్సన్‌ను విడిచిపెట్టిన కారణంగా.. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ కోసం చూస్తోంది. ఇందుకోసం వేలంలో పలువురి ఆటగాళ్లపై దృష్టి సారించింది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హైదరాబాద్ ముందున్న ఆప్షన్ల గురించి మాట్లాడాడు. కేన్ విలియమ్సన్‌ను భర్తీ చేయలాంటే.. అనభవజ్ఞుడైన భారత ఆటగాడిని తీసుకోవాలని సూచించాడు.

"ఎస్ఆర్‌హెచ్ విలియమ్సన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్నాను. ఎందుకంటే అతడు మంచి దూకుడైన ఓపెనర్. విలియమ్సన్ లేనందున ఆ స్థానాన్ని అనుభవజ్ఞుడైన మయాంక్‌తోనే సాధ్యమవుతుంది. అతడు నిర్భయంగా ఫ్రీగా షాట్లు ఆడగలడు. అంతేకాకుండా జట్టును ముందుండి నడిపించగల కెప్టెన్సీ నైపుణ్యాలు కూడా అతడిలో ఉన్నాయి. కాబట్టి అతడిని తీసుకుంటే మంచిది." అని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ 2022 వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ రిటేన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. అతడిని రూ.14 కోట్ల భారీ మొత్తానిక తన వద్దే ఉంచుకుంది. అయితే ఈ ఏడాది హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేయడంతో అతడిని ఇటీవలే జట్టు నుంచ విడిచిపెట్టి ఐపీఎల్ 2023 మినీ వేలానికి వెళ్తోంది. దీంతో మయాంక్ అగర్వాల్‌ను తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

మరోపక్క ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన మయాంక్ అగర్వాల్‌ను ఆ జట్టు వదులుకుంది. అతడి స్థఆనంలో శిఖర్ ధావన్‌ను కెప్టెన్సీగా పగ్గాలు అప్పగించింది. దీంతో అతడి వేలంలో పోటీ పడుతున్నాడు. గతంలో మయాంక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్, రైజింగ్ పుణె తరఫున ఆడాడు. మరి ఈ సారి అతడిని ఎవరు కొనుగోలు చేస్తారో వేచి చూడాలి. ఐపీఎల్ 2023 మినీ వేలం డిసెంబరు 23 కొచ్చి వేదికగా ప్రారంభం కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం