Bcci New Rules : ఒక్కో ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్లు -దేశ‌వాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్స్‌-two bouncers in an over bcci allowes new rules in syed mushtaq ali trophy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bcci New Rules : ఒక్కో ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్లు -దేశ‌వాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్స్‌

Bcci New Rules : ఒక్కో ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్లు -దేశ‌వాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్స్‌

HT Telugu Desk HT Telugu
Apr 17, 2024 05:03 PM IST

Bcci New Rules: దేశ‌వాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఒక‌పై ఒక్కో ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్లు వేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి ఈ కొత్త రూల్స్ అమ‌లులోకి రానున్నాయి.

బీసీసీఐ
బీసీసీఐ

Bcci New Rules: స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీని కొత్త పంథాలో నిర్వ‌హించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. టోర్నీ రూల్స్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ విధానం స‌క్సెస్ కావ‌డంతో ఆ రూల్‌ను స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలో ప్ర‌వేశ‌పెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా ఇప్ప‌టివ‌ర‌కు టీ20 క్రికెట్‌లో ఓవ‌ర్‌కు ఒకే బౌన్స‌ర్ మాత్ర‌మే వేసే ఛాన్స్ పేస్ బౌల‌ర్ల‌కు ఉంది.

ఈ రూల్‌లో మార్పులు చేసిన బీసీసీఐ ఒక ఓవ‌ర్‌లో రెండు బౌన్స‌ర్లు వేసేలా కొత్త నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను అమ‌లులోకి తీసుకురానుంది. శుక్ర‌వారం ముంబ‌యిలో జ‌రిగిన అపెక్స్ క‌మిటీ మీటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌తో పాటు రెండు బౌన్స‌ర్ల‌కు సంబంధించిన రూల్‌కు బీసీసీఐ అనుమ‌తి ఇచ్చింది.

ఈ ఏడాది స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా ఈ కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారు. ఇవి స‌క్సెస్ అయితే మిగిలిన దేశ‌వాళీ టోర్నీలో ఈ రూల్స్‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలిసింది. సాధార‌ణంగా టీ20ల్లో బ్యాట‌ర్ల‌దే ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంటుంది. అయితే రెండు బౌన్స‌ర్ల రూల్ ద్వారా బౌల‌ర్ల ప్ర‌భావం పెరిగే అవ‌కాశం ఉంద‌నే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు తెలిసింది.

అందుకే ఈ రూల్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. అలాగే ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ఎప్పుడైనా ఉప‌యోగించుకునే వెసులుబాటును క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. 2023 -24 స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీ అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ ఆరు వ‌ర‌కు జ‌రుగ‌నుంది. ఈ టోర్నీలో మొత్తం 38 టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Whats_app_banner

టాపిక్