తెలుగు న్యూస్ / ఫోటో /
Kohli IPL Record: ఐపీఎల్లో కోహ్లి పేరిట అరుదైన రికార్డు.. వార్నర్ తర్వాత అతడే
- Kohli IPL Record: ఐపీఎల్లో కోహ్లి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా విరాట్ నిలిచాడు.
- Kohli IPL Record: ఐపీఎల్లో కోహ్లి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ గా విరాట్ నిలిచాడు.
(1 / 5)
Kohli IPL Record: ఐపీఎల్లో అత్యధిక 50కిపైగా స్కోర్లు సాధించిన బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ముందున్నాడు. అతడు ఇప్పటి వరకూ 60సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. అందులో 56 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు ఉన్నాయి. 163 మ్యాచ్ లలో వార్నర్ 5937 రన్స్ చేశాడు.
(2 / 5)
Kohli IPL Record: వార్నర్ తర్వాత ఐపీఎల్లో అత్యధికసార్లు 50కిపై స్కోర్లు నమోదు చేశాడు. ఆదివారం (ఏప్రిల్ 2) ముంబై ఇండియన్స్ పై హాఫ్ సెంచరీ చేసిన అతడు 50కిపైగా స్కోర్లు 50సార్లు చేసిన ఘనత అందుకున్నాడు. అందులో 45 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 6706 రన్స్ చేయడం విశేషం.
(3 / 5)
Kohli IPL Record: ఈ జాబితాలో శిఖర్ ధావన్ మూడోస్థానంలో ఉన్నాడు. ధావన్ ఇప్పటి వరకూ ఐపీఎల్లో 49సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. అందులో 47 హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ధావన్ 207 మ్యాచ్ లలో 6284 రన్స్ చేయడం విశేషం.
(4 / 5)
Kohli IPL Record: ఆర్సీబీ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్లో 43సార్లు 50కిపైగా స్కోర్లు చేశాడు. అందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. ఏబీడీ 184 ఐపీఎల్ మ్యాచ్ లలో 5162 రన్స్ చేశాడు.
ఇతర గ్యాలరీలు