Jofra Archer Ruled Out: ముంబై ఇండియ‌న్స్‌కు షాకిచ్చిన స్టార్ పేస‌ర్ - ఐపీఎల్‌కు దూరం-jofra archer ruled out of ipl 2023 with fitness issues
Telugu News  /  Sports  /  Jofra Archer Ruled Out Of Ipl 2023 With Fitness Issues
జోఫ్రా ఆర్చ‌ర్
జోఫ్రా ఆర్చ‌ర్

Jofra Archer Ruled Out: ముంబై ఇండియ‌న్స్‌కు షాకిచ్చిన స్టార్ పేస‌ర్ - ఐపీఎల్‌కు దూరం

09 May 2023, 13:13 ISTHT Telugu Desk
09 May 2023, 13:13 IST

Jofra Archer Ruled Out: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ షాకిచ్చాడు. గాయంతో పాటు ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు.

Jofra Archer Ruled Out: ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు షాక్ త‌గిలింది. స్టార్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. అత‌డి స్థానాన్ని మ‌రో ఇంగ్లాండ్ పేస‌ర్ క్రిస్ జోర్డాన్ భ‌ర్తీ చేస్తోన్న‌ట్లు ముంబై ఇండియ‌న్స్ ప్ర‌క‌టించింది. గాయం కార‌ణంగా గ‌త రెండేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఆర్చ‌ర్ ఐపీఎల్‌తోనే పున‌రాగ‌మ‌నం చేశాడు.

తొలి మ్యాచ్‌లో బ‌రిలో దిగిన ఆర్చ‌ర్ మోచేతి గాయంతో ఆ త‌ర్వాత జ‌రిగిన నాలుగు మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ ఆడిన ప‌ది మ్యాచుల్లో ఐదు మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడిన ఆర్చ‌ర్ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయాడు.

కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే తీసుకున్నాడు. గాయం తీవ్ర‌త ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉండ‌టం, ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌కు దూరం కావాల‌ని నిర్ణ‌యించుకున్న ఆర్చ‌ర్ ఇంగ్లాండ్ వెళ్లిపోయిన‌ట్లు తెలిసింది.

దాంతో అత‌డి స్థానంలో క్రిజ్ జోర్డాన్ జ‌ట్టులో చేరాడు. ఇప్ప‌టికే జ‌ట్టులో చేరిన జోర్డాన్ ముంబై ఆట‌గాళ్ల‌తో క‌లిసి సాధ‌న చేస్తోన్న‌ట్లు స‌మాచారం. మంగ‌ళ‌వారం రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో జోర్డాన్ బ‌రిలో దిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

ఐపీఎల్ వేలంలో జోఫ్రా ఆర్చ‌ర్‌ను ఎనిమిది కోట్ల‌కు ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది. బుమ్రా జ‌ట్టుకు దూరం కావ‌డంతో అత‌డు లేని లోటును ఆర్చ‌ర్ తీర్చుతాడ‌ని ముంబై అభిమానులు ఆశ‌గా ఎదురుచూశారు. కానీ వారి ఆశ‌ల‌ను వ‌మ్ము చేస్తూ మ‌ధ్య‌లోనే ఐపీఎల్‌ను వ‌దిలిపెట్టి వెళ్లిపోవ‌డంతో అత‌డిపై క్రికెట్ ఫ్యాన్స్ విమ‌ర్శ‌లు కురిపిస్తోన్నారు.