IPL 2023 Points Table: టాప్ ఫైవ్‌లోకి బెంగ‌ళూరు - ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో కోహ్లి-ipl 2023 points table kohli enters fourth place in orange cap holders list ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: టాప్ ఫైవ్‌లోకి బెంగ‌ళూరు - ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో కోహ్లి

IPL 2023 Points Table: టాప్ ఫైవ్‌లోకి బెంగ‌ళూరు - ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో కోహ్లి

Nelki Naresh Kumar HT Telugu
May 02, 2023 11:33 AM IST

IPL 2023 Points Table: ల‌క్నోపై విజ‌యంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐదో స్థానానికి చేరుకున్న‌ది. ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ రేసులో కోహ్లి నాలుగో స్థానంలో నిలిచాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి

IPL 2023 Points Table: ల‌క్నోపై స్ట‌న్నింగ్ విక్ట‌రీతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో టాప్ ఫైవ్‌లోకి అడుగుపెట్టింది. తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజ‌యాల‌తో ప‌ది పాయింట్ల‌ను ద‌క్కించుకున్న బెంగ‌ళూరు పంజాబ్‌ను వెన‌క్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకున్న‌ది. మ‌రోవైపు బెంగ‌ళూరు చేతిలో ఓట‌మి పాలైన ల‌క్నో మూడో స్థానం మాత్రం గ‌ల్లంతు కాలేదు.

తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజ‌యాల‌తో ల‌క్నో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. టాప్ ప్లేస్‌లో గుజ‌రాత్‌...రెండో స్థానంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కొన‌సాగుతోన్నాయి. ఆరో స్థానంలో పంజాబ్‌, ఏడో స్థానంలో ముంబై నిలిచాయి. చివ‌రి మూడు స్థాన‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్, ఢిల్లీ ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ - డుప్లెసిస్ వ‌ర్సెస్ జైస్వాల్‌

ఆరెంజ్ క్యాప్ లీడ‌ర్స్ రేసులో య‌శ‌స్వి జైస్వాల్‌ను అధిగ‌మిస్తూ బెంగ‌ళూరు బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 9 మ్యాచుల్లో 466 ర‌న్స్‌తో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో డుప్లెసిస్ నిలిచాడు.

428 ర‌న్స్‌తో య‌శ‌స్వి జైస్వాల్ రెండో స్థానంలోనిలిచాడు. మూడో స్థానంలో 414 ర‌న్స్‌తో డేవాన్ కాన్వే ఉండ‌గా కోహ్లి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 9 మ్యాచుల్లో కోహ్లి 364 ర‌న్స్ చేశాడు. రుతురాజ్ ఐదో ప్లేస్‌లో కొన‌సాగుతోన్నాడు.

ప‌ర్పుల్ క్యాప్ లీడ‌ర్స్‌...

ప‌ర్పుల్ క్యాప్ జాబితాలో బెంగ‌ళూరు పేస‌ర్ సిరాజ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. తొమ్మిది మ్యాచుల్లో 7.34 ఏకాన‌మీ రేటుతో సిరాజ్ 15వికెట్లు తీశాడు. ప‌ర్పుల్ లిస్ట్‌లో 17 వికెట్ల‌తో చెన్నై పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే టాప్‌లోనే కొన‌సాగుతోన్నాడు. ప‌దిహేను వికెట్ల‌తో అర్ష‌దీప్‌సింగ్ మూడో స్థానంలో, 14 వికెట్ల‌తో ర‌షీద్‌ఖాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. అశ్విన్ (13 వికెట్లు) టాప్ ఫైవ్‌లో కొన‌సాగుతోన్నాడు.

Whats_app_banner