IPL 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లిన చెన్నై - పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో సిరాజ్ వర్సెస్ అర్షదీప్
IPL 2023 Points Table: ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ప్లేస్‌కు చేరుకున్నది. కోల్‌కతాపై స్టన్నింగ్ విక్టరీతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. పర్పుల్ క్యాప్ లీడర్స్‌లో సిరాజ్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
IPL 2023 Points Table: ఓటమితోఐపీఎల్ 2023ని మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జూలు విదుల్చుతోంది. అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తోంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై తిరుగులేని విజయంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్నది చెన్నై సూపర్ కింగ్స్.
ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పది పాయింట్లు సొంతం చేసుకున్న చెన్నై థర్డ్ ప్లేస్ నుంచి మొదటి స్థానానికి జంప్ చేసింది. చెన్నై చెన్నై జోరుతో రాజస్థాన్ రెండో స్థానానికి పడిపోగా...లక్నో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది. నాలుగో స్థానంలో గుజరాత్ జెయింట్స్, ఐదో ప్లేస్‌లో ఆర్‌సీబీ ఉన్నాయి. పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి ఫస్ట్ ప్లేస్‌లో ఢిల్లీ కొనసాగుతోండగా, రెండో స్థానం సన్‌రైజర్స్ నిలిచింది.
కాన్వే సెకండ్ ప్లేస్
ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లిస్ట్‌లో చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే సెకండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు. కోల్‌కతాపై హాఫ్ సెంచరీ సాధించిన కాన్వే ఏడు మ్యాచుల్లో 314 ర న్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ లీడర్స్ లిస్ట్‌లో డుప్లెసిస్ 415 రన్స్‌తో నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
రాజస్థాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 62 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో 285 పరుగులతో డేవిడ్ వార్నర్ మూడో స్థానంలో నిలవగా 279 రన్స్‌తో కోహ్లి ఫోర్త్ ప్లేస్‌లో కొనసాగుతోన్నాడు.
పర్పుల్ క్యాప్‌లో సిరాజ్ వర్సెస్ అర్షదీప్
పర్పుల్ క్యాప్ లిస్ట్‌లో బెంగళూరు పేసర్ సిరాజ్, పంజాబ్ బౌలర్ అర్షదీప్ నువ్వానేనా అన్నట్లుగా పోటీపడుతోన్నారు. సిరాజ్ పదమూడు వికెట్లతో నంబర్ వన్ స్థానం దక్కించుకోగా అర్షదీప్ కూడా 13 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఏకానమీ రేటు ప్రకారం సిరాజ్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. . 12 వికెట్లతో చాహల్ మూడో స్థానంలో ఉన్నాడు. నాలుగో స్థానంలో రషీద్‌ఖాన్ (12 వికెట్లు), ఐదో స్థానంలో తుషార్ దేవ్‌పాండే (12 వికెట్లు)నిలిచారు.