Karun Nair Replaces Kl Rahul: రాహుల్ ప్లేస్‌లో లక్నో టీమ్‌లో జాయిన్ అయిన కర్ణాటక ఆల్‌రౌండర్
Karun Nair Replaces Kl Rahul: గాయం కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే.రాహుల్ స్థానాన్ని కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్ భర్తీ చేయనున్నాడు.
Karun Nair Replaces Kl Rahul: గాయం కారణంగా లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కర్ణాటక ఆల్‌రౌండర్ కరణ్ నాయర్‌ను ఎంపికచేసింది. యాభై లక్షల బేస్ ధరతో కరణ్ నాయర్ లక్నో టీమ్‌లో చేరాడు.
రాహుల్ ప్లేస్‌లో కరణ్ నాయర్ లక్నో జట్టులో చేరినట్లు ఐపీఎల్ ట్వీట్ చేసింది. టీమ్ ఇండియా తరఫున ఆరు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కరణ్ నాయర్ ఇంగ్లాండ్‌పై 2016లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. వీరంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఘనతను సాధించిన రెండో టీమ్ ఇండియా ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో పాటు పంజాబ్ కింగ్స్ టీమ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
తాజాగా లక్నో టీమ్‌లో అతడు జాయిన్ అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తోండగా కేఎల్ రాహుల్ గాయపడిన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్‌తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అతడు దూరమవుతోన్నట్లుగా బీసీసీఐ ప్రకటించారు.
ఇప్పటికే సర్జరీతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమవ్వగా, గాయల కారణంగా జయదేవ్ ఉనద్కత్, సంజూ శాంసన్ తప్పుకున్నారు. తాజాగా ఈ జాబితాలో రాహుల్ చేరిపోవడంతో టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుంది. ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా తలపడనున్న సంగతి తెలిసిందే.
టాపిక్