Commonwealth Games 2022: ఇండియా హ్యాట్రిక్.. బ్యాడ్మింటన్ డబుల్స్‌లోనూ గోల్డ్
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ చివరి రోజు మన షట్లర్లు చెలరేగిపోయారు. వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. పురుషుల, మహిళల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ సాత్విక్, చిరాగ్ జోడీ ఇండియాకు గోల్డ్ మెడల్ అందించింది.
బర్మింగ్‌హామ్: ఇండియన్ బ్యాడ్మింటన్ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రత్యర్థులను పూర్తిగా డామినేట్ చేస్తూ.. చివరి రోజు వరుసగా మూడు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు ఇండియన్ షట్లర్లు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-15, 21-13 తేడాతో వరుస గేమ్స్‌లో గెలిచారు.
అంతకుముందు మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ గోల్డ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఇండియా బ్యాడ్మింటన్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో ఇండియన్ జోడీ జోరు ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు. మ్యాచ్ మొదటి నుంచే లీడ్‌లోకి దూసుకెళ్లిన భారత జోడీ.. చివరి వరకూ ఆధిపత్యాన్ని కొనసాగించింది.