India at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో 30 దాటిన ఇండియా మెడల్స్.. టేబుల్లో నాలుగో స్థానానికి..-india moved to 4th place in medals tally at asian games ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India At Asian Games: ఏషియన్ గేమ్స్‌లో 30 దాటిన ఇండియా మెడల్స్.. టేబుల్లో నాలుగో స్థానానికి..

India at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో 30 దాటిన ఇండియా మెడల్స్.. టేబుల్లో నాలుగో స్థానానికి..

Hari Prasad S HT Telugu
Sep 29, 2023 04:59 PM IST

India at Asian Games: ఏషియన్ గేమ్స్‌లో 30 దాటాయి ఇండియా మెడల్స్. దీంతో మెడల్స్ టేబుల్లో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. గోల్డ్ మెడల్స్ కాకుండా ఓవరాల్ గా చూస్తే మాత్రం ఐదో స్థానంలో ఉంది.

ఏషియన్ గేమ్స్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ టీమ్
ఏషియన్ గేమ్స్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఇండియన్ టీమ్ (AP)

India at Asian Games: ఏషియన్ గేమ్స్ 2023లో ఇండియా దూసుకెళ్తోంది. భారత అథ్లెట్లు ముఖ్యంగా షూటర్లు మెడల్స్ పంట పండిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఇండియా మెడల్స్ మొత్తం 31కి చేరింది. వీటిలో 17 మెడల్స్ కేవలం షూటింగ్ లోనే రావడం విశేషం. ఇండియా 8 గోల్డ్ మెడల్స్ తో నాలుగో స్థానంలో ఉండగా.. చైనా, కొరియా, జపాన్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఏషియన్ గేమ్స్ లో ఇండియా 8 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. గోల్డ్ మెడల్స్ పరంగా చూస్తే నాలుగో స్థానంలో ఉన్న ఇండియా.. ఓవరాల్ గా మాత్రం ఐదో స్థానంలో ఉంది. హాంకాంగ్ ఓవరాల్ గా 32 మెడల్స్ గెలిచినా.. అందులో గోల్డ్ మెడల్స్ 5 మాత్రమే ఉండటంతో ఆ దేశం ఏడో స్థానంలో ఉంది.

ఇప్పటి వరకూ ఇండియాకు క్రికెట్, షూటింగ్, వుషు, సెయిలింగ్, రోయింగ్, టెన్నిస్, ఈక్వెస్ట్రియాన్, స్క్వాష్ లలో మెడల్స్ వచ్చాయి. 8 గోల్డ్ మెడల్స్ లో 6 షూటింగ్ లోనే రాగా.. ఒకటి క్రికెట్, మరొకటి ఈక్వెస్ట్రియాన్ లలో వచ్చాయి. షూటర్ ఐశ్వరి ప్రతాప్సింగ్ రెండు గోల్డ్ సహా నాలుగు మెడల్స్ తో టాప్ లో ఉండగా.. ఈషా సింగ్ ఒక గోల్డ్, మూడు సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకుంది.

ఇండియా ఇప్పటి వరకూ ఏషియన్ గేమ్స్ లో అత్యధికంగా 70 మెడల్స్ సాధించింది. చివరిసారి 2018లో జకార్తాలో జరిగిన గేమ్స్ లోనే ఈ రికార్డు మెడల్స్ సొంతం చేసుకుంది. వాటిలో 16 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఈసారి ఆరో రోజు వరకే ఇండియా 8 గోల్డ్ సహా 31 మెడల్స్ సాధించింది. ఈసారి 100 మెడల్స్ లక్ష్యంగా ఇండియా బరిలోకి దిగింది.

ఇండియాకు మెడల్స్ ఎక్కువగా సాధించి పెట్టే అథ్లెటిక్స్ ప్రారంభమైతే ఈ పతకాల సంఖ్య గణనీయంగా పెరగొచ్చు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతోపాటు మరికొందరు స్టార్ అథ్లెట్లు.. ట్రాక్ అండ్ ఫీల్డ్ లోపోటీ పడబోతున్నారు. అక్టోబర్ 8 వరకూ ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. ఇండియా ఇప్పటి వరకూ ప్రతి ఏషియన్ గేమ్స్ లోనూ పాల్గొనడం విశేషం.

Whats_app_banner