India vs Bangladesh 2nd Test: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 ర‌న్స్‌కు ఆలౌట్ - ఇండియా ముందు ఈజీ టార్గెట్‌-ind vs ban 2nd test bangladesh all out 231 runs as india need 145 runs to win ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Ind Vs Ban 2nd Test Bangladesh All Out 231 Runs As India Need 145 Runs To Win

India vs Bangladesh 2nd Test: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 ర‌న్స్‌కు ఆలౌట్ - ఇండియా ముందు ఈజీ టార్గెట్‌

ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌
ఇండియా వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌

India vs Bangladesh 2nd Test: రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 ప‌రుగులు స్వ‌ల్ప టార్గెట్‌ను విధించింది.

India vs Bangladesh 2nd Test: రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా విజ‌యంపై క‌న్నేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 231 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఇండియా ముందు 145 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని విధించింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్స్‌లో లిట‌న్ దాస్ 73 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. జ‌కీర్ హ‌స‌న్ 51 ర‌న్స్‌, నురుల్ హ‌స‌న్, టాస్కిన్ అహ్మ‌ద్ త‌లో 31 ప‌రుగులు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

టీమ్ ఇండియా బౌల‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్ 3, సిరాజ్, అశ్విన్ త‌లో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్‌, జ‌య‌దేవ్‌ల‌కు ఒక్కో వికెట్ ద‌క్కింది. ఏడు ప‌రుగుల ఓవ‌ర్ నైట్ స్కోరుతో మూడోరోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్‌ను పేస‌ర్లు జ‌య‌దేవ్‌, సిరాజ్‌, ఉమేష్ దెబ్బ‌కొట్టారు. ఆ త‌ర్వాత మిడిల్ ఆర్ట‌ర్ ప‌నిని అక్ష‌ర్ ప‌టేల్ చూసుకున్నాడు.

ఓపెన‌ర్ జ‌కీర్ హ‌స‌న్‌తో పాటు లిట‌న్ దాస్ పోరాడ‌టంతో బంగ్లాదేశ్ ఈ మాత్ర‌మైనా స్కోరు చేసింది. చివ‌ర‌లో నురుల్, టాస్కిన్ కొద్ది సేపు టీమ్ ఇండియా బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్నారు. రెండు టెస్ట్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 227 ప‌రుగులు చేయ‌గా... టీమ్ ఇండియా 314 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ప్ర‌స్తుతం టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.