ICC on India Pitches: నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌ల‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్‌-icc given average rating to delhi and nagpur pitches ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Icc Given Average Rating To Delhi And Nagpur Pitches

ICC on India Pitches: నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌ల‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్‌

ఐసీసీ
ఐసీసీ

ICC on India Pitches: నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌ల‌కు ఐసీసీ యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చిన‌ట్లుగా ఆస్ట్రేలియా మీడియా రాసిన క‌థ‌నాలు క్రికెట్ వ‌ర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

ICC on India Pitches: ఇండియా పిచ్‌ల‌పై ఐసీసీ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం . ఢిల్లీ, నాగ్‌పూర్ పిచ్‌ల‌కు యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చిన‌ట్లు ఆస్ట్రేలియా మీడియా క‌థ‌నాల్ని రాసింది. ప్ర‌స్తుతం బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది టీమ్ ఇండియా.

ట్రెండింగ్ వార్తలు

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన రెండు టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా సంపూర్ణ ఆధిప‌త్యాన్ని క‌న‌బ‌రిచింది. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. తొలి టెస్ట్ నాగ్‌పూర్ వేదిక‌గా జ‌ర‌గ్గా రెండో టెస్ట్‌కు ఢిల్లీ ఆతిథ్యం ఇచ్చింది. ఈ దారుణ ప‌రాభ‌వాల నేప‌థ్యంలో స్పిన్ బౌలింగ్‌కు స‌హ‌క‌రించేలా ఈ పిచ్‌ల‌ను ఇండియా త‌యారు చేసుకుంద‌ని ఆస్ట్రేలియా క్రికెట్ వ‌ర్గాలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నాయి.

తాజాగా ఐసీసీ కూడా నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌ల‌కు యావ‌రేజ్ రేటింగ్ ఇచ్చిన‌ట్లు ఆస్ట్రేలియాకు చెందిన ది ఏజ్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప‌త్రిక‌లు పేర్కొన్నాయి. మ్యాచ్ రిఫ‌రీ కూడా ఐసీసీ రేటింగ్‌తో ఏకీభ‌వించిన‌ట్లు ఈ క‌థ‌నాల్లో వెల్ల‌డించాయి. ఐసీసీ రేటింగ్ వార్త‌లు క్రికెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోన్నాయి. ఐసీసీ నిజంగానే ఈ రేటింగ్ ఇచ్చిందా లేదా అన్న‌ది అధికారికంగా మాత్రం వెల్ల‌డికాలేదు.

2017లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇండియా లో ప‌ర్య‌టించిన‌ప్పుడు పిచ్ రేటింగ్‌ల‌కు సంబంధించిన వివాదం ఆస‌క్తిని రేకెత్తించింది. అప్ప‌ట్లో పూణే పిచ్‌కు రిఫ‌రీ క్రిస్ బ్రాడ్ పూర్ రేటింగ్ ఇచ్చాడు. బెంగ‌ళూరు పిచ్ ను బిలో యావ‌రేజ్‌గా పేర్కొన‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

WhatsApp channel