Andrew Symonds |సైమండ్స్ కెరీర్ ను దెబ్బతీసిన మంకీ గేట్ వివాదం...అప్పుడు ఏం జరిగిందంటే...
ఆండ్రూ సైమండ్స్ క్రికెట్ కెరీర్ ను మలుపు తిప్పిన సంఘటనల్లో మంకీ గేట్ వివాదం ఒకటి. 2008 జరిగిన ఈ వివాదం ఆండ్రూ సైమండ్స్ కెరీర్ పై చాలా ప్రభావాన్ని చూపించింది. అప్పుడు ఏం జరిగిందంటే...
సుదీర్ఘ క్రికెట్ కెరీర్ లో అద్భుతమైన విజయాలతో పాటు ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నారు ఆండ్రూ సైమండ్స్. ముఖ్యంగా మంకీగేట్ వివాదం అతడి కెరీర్ దెబ్బతీసింది. తనపై ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశాడంటూ ఆండ్రూ సైమండ్స్ ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది.
2008లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా లో టీమ్ ఇండియా పర్యటించింది. సిడ్నీలో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనను మంకీ అంటూ హర్భజన్ కామెంట్ చేశాడని సైమండ్స్ ఆరోపించారు. తన శారీరక రూపాన్ని ఉద్దేశించి భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నాడు. భజ్జీ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ అతడిపై మూడు మ్యాచ్ ల నిషేధం విధించింది. భజ్జీ అలాంటి కామెంట్స్ చేయలేదంటూ టీమ్ ఇండియా వాదించింది. ఆ సమయంలో మరో ఎండ్ లో బ్యాటింగ్ చేస్తున్న సచిన్ కూడా సైమండ్స్ పై భజ్జీ జాత్యాహంకార వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు.
హర్భజన్ పై నిషేధాన్ని ఎత్తివేకయపోతే సిరీస్ ను బహిష్కరిస్తామని టీమ్ ఇండియా డిమాండ్ చేయడంలో ఆసీస్ వెనక్కి తగ్గింది. ఆస్ట్రేలియా బోర్డ్ నిర్ణయంతో సైమండ్స్ కలత చెందారు. ఈ సంఘటన అతడి కెరీర్ పై ప్రభావాన్ని చూపించింది. ఈ మంకీగేట్ వివాదం తర్వాత ఫామ్ కోల్పోయి టెస్ట్ జట్టుకు దురమయ్యారు.
ఐపీఎల్ లో 2011లో ముంబై ఇండియన్స్ కు సైమండ్స్ ప్రాతినిథ్యం వహించాడు. ఆ సమయంలో ముంబై తరఫున భజ్జీ కూడా ఆడాడు. అప్పుడే ఒకరికొకరు క్షమాపణలలు చెప్పుకొని ఈ వివాదానికి స్వస్తి పలికారు. ఛంఢీఘర్ లోని తన స్నేహితుడి ఇంటికి సైమండ్స్ తీసుకెళ్లానని, అక్కడే అతడికి క్షమాపణలు చెప్పానని భజ్జీ గతంలో పేర్కొన్నారు.
శనివారం కారు ప్రమాదంలో మరణించిన ఆండ్రూ సైమండ్స్ కు భజ్జీ సంతాపం వ్యక్తం చేశాడు. సైమండ్స్ మరణవార్త తననకు షాక్ గురిచేసిందని పేర్కొన్నాడు. అతడి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు భజ్జీ ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
సంబంధిత కథనం
టాపిక్