FIFA World Cup 2022 Today Schedule: ఈక్వెడార్‌ నిలిచేనా? సెనెగల్‌తో మ్యాచ్.. డచ్‌తో ఖతర్ ఢీ-here matches schedule of fifa world cup 2022 day 10 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Here Matches Schedule Of Fifa World Cup 2022 Day 10

FIFA World Cup 2022 Today Schedule: ఈక్వెడార్‌ నిలిచేనా? సెనెగల్‌తో మ్యాచ్.. డచ్‌తో ఖతర్ ఢీ

Maragani Govardhan HT Telugu
Nov 29, 2022 07:01 AM IST

FIFA World Cup 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. నెదర్లాండ్స్ జట్టు ఖతర్‌తో పోటీ పడనుండగా.. ఈక్వెడార్-సెనెగల్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి.

ఫిఫా ప్రపంచకప్ 2022 పదో రోజు షెడ్యూల్
ఫిఫా ప్రపంచకప్ 2022 పదో రోజు షెడ్యూల్ (AFP)

FIFA World Cup 2022 Today Schedule: ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2022లో గ్రూప్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. మరో నాలుగో రోజుల్లో రౌండ్-16 మ్యాచ్‌లు ఆరంభం కానున్న దశలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు గ్రూప్-ఏ జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఈ గ్రూపులో ఆతిథ్యమిస్తున్న ఖతర్ సహా నెదర్లాండ్స్, ఈక్వెడార్, సెనెగల్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ టాపర్‌గా నెదర్లాండ్స్ ఉండగా.. చివరి స్థానంలో ఉన్న ఖతర్ రౌండ్ ఆఫ్ 16 ఆశలపై నీళ్లు చల్లుకుంది.

ట్రెండింగ్ వార్తలు

నవంబరు 29న జరగనున్న మ్యాచ్‌లు..

గ్రూప్-ఏలో నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు కూడా రాత్రి 8.30కే ప్రారంభం కానుండటం గమనార్హం.

ఈక్వెండార్-సెనెగల్.. మధ్య ఖలీపా ఇంటర్నెషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

నెదర్లాండ్స్-ఖతర్.. మధ్య అల్ బైట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.

ఈ గ్రూప్‌‌లో నెదర్లాండ్స్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో విజయం సాధించగా.. మరో దాంట్లో డ్రాగా నిలిచి అగ్రస్థానంలో ఉంది. మరోపక్క ఖతర్ మాత్రం ఆడిన రెండింటిలోనూ ఓడి రౌండ్ ఆఫ్ 16 ఆశలను దాదాపు వదిలేసుకుంది. నెదర్లాండ్స్ మాత్రం సునాయసంగా రౌండ్ ఆఫ్ 16కి చేరుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ డచ్ జట్టుకు పెద్దగా నష్టమేమి జరగదు.

మరోవైపు ఈక్వెండార్-సెనెగల్ మధ్య మ్యాచ్ ఆసక్తిగా మారనుంది. ఈక్వెడార్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో ఓడితే మాత్రం రౌండ్ ఆఫ్ 16 ఆశలు సంక్లిష్టమవుతాయి. ఎందుకంటే ఈక్వెడార్ ఆడిన రెండింటిలో ఓ మ్యాచ్‌లో డ్రా చేసుకోగా.. మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. మరోపక్క సెనెగల్ ఓ విజయం, ఓ ఓటమితో మూడో స్థానంలో ఉంది. ఈక్వెండార్ రేసులో నిలవాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. సెనెగల్‌పై ఓడితే మాత్రం.. నెదర్లాండ్స్‌ను ఖతర్ అత్యధిక మార్జిన్‌తో ఓడించాలి. అప్పుడే ఈక్వెడార్‌ రౌండ్ ఆఫ్ 16 ఆశలు నిలుస్తాయి.

ఈ రెండు మ్యాచ్‌లు కాకుండా ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు గ్రూప్-బీ జట్లయిన ఇరాన్-అమెరికా, వేల్స్-ఇంగ్లాండ్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. గ్రూప్ మ్యాచ్‌లు ముగింపునకు వచ్చేసరికి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

WhatsApp channel

సంబంధిత కథనం