IPL 2022 | Dream 11 టీమ్ క్రియేట్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి!
IPL 2022 సీజన్ మొదలైంది. దీంతో Dream 11లాంటి ఫ్యాంటసీ గేమ్స్ కు డిమాండ్ పెరిగింది. క్రికెట్ ఫ్యాన్స్ తమ ఫేవరెట్ టీమ్స్ ను తామే ఎంపిక చేస్తూ డబ్బు కూడా సంపాదించే పనిలో ఉన్నారు.
క్రికెట్‌ను ఎంతగానో ఆరాధించే యువత ఉన్న ఇండియాలో సహజంగానే ఈ Dream 11 వంటి ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ప్రతి మ్యాచ్‌కు ముందు అందులో ఆడబోయే ప్లేయర్స్‌ను ఎంపిక చేసే ఛాన్స్ ఉండటం, దానికి పాయింట్లు, రివార్డులు, క్యాష్ ప్రైజ్‌లు వంటివి యూత్‌ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
క్రికెట్ మజాను ఆస్వాదిస్తూనే.. తమకు ఇష్టమైన గేమ్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎంతోకొంత సంపాదించే వీలు ఉందంటే ఎవరు మాత్రం వద్దంటారు. క్రికెట్ వీరాభిమానులుగా చెప్పుకునే వారు కూడా ఈ ఆటపై తమకు ఎంత పట్టుందో Dream 11 వంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా తెలుసుకునే ఛాన్స్ ఉంటోంది. క్రికెట్ నైపుణ్యంతోపాటు కాస్త అదృష్టం కూడా తోడైతే.. డబ్బూ వస్తుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో జరిగే అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌ల టీమ్స్ ఎంపిక, ఫలితాలను అంచనా వేసే అవకాశం ఈ Dream 11 ద్వారా ఉంటుంది. సరైన టీమ్ ఎంపిక అనేది మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యానికి పరీక్ష. అయితే కొన్ని టిప్స్ పాటించడం వల్ల సరైన టీమ్ ఎంపిక చేయవచ్చు.
Dream 11 మ్యాచ్‌ల ఎంపికే కీలకం
క్రికెట్ మ్యాచ్‌లకు టీమ్స్‌ను ఎంపిక చేయడం, సరైన ప్లేయర్స్‌ను ఎంపిక చేసి పాయింట్ల టేబుల్లో టాప్‌లో నిలిచేసి, డబ్బు గెలవడం అంటే ఎవరికైనా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ ఉత్సాహమే డేంజర్‌లో పడేస్తుంది. Dream 11 వంటి ఫ్యాంటసీ క్రికెట్ ఆడేవాళ్లు ఆ ఉత్సాహంలోనే అన్ని మ్యాచ్‌లనూ ఆడేస్తుంటారు. ఇలా ఆడి ఎక్కువ డబ్బులు పోగేసుకుందామని ఆశపడతారు. కానీ అదే పొరపాటు.
చాలా మంది ఇలా ఆడబోయి డబ్బులు పోవడంతో కొన్నాళ్లకే గుడ్‌బై చెప్పేస్తున్నారు. అలా కాకుండా చాలా జాగ్రత్తగా కొన్ని మ్యాచ్‌లను ఎంపిక చేసుకోవడం కీలకం. మీకు పెద్దగా తెలియని మ్యాచ్‌ల జోలికి పోకపోవడమే ఉత్తమం. మీకు పూర్తిగా పట్టున్న టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్‌లను ఎంపిక చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Dream 11 అంత ఈజీ ఏమీ కాదు
ఎక్కడైనా సరే డబ్బులు అంత ఈజీగా ఏమీ రావు. Dream 11 విషయంలోనూ అంతే. మీకు ఎంత క్రికెట్ పరిజ్ఞానం ఉన్నా కూడా మ్యాచ్ పరిస్థితులను అధ్యయనం చేసి, మ్యాచ్‌కు ముందు కాస్త రీసెర్చ్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల అందరి కంటే బలమైన టీమ్‌ను మీరు ఎంపిక చేయగలుగుతారు. టీమ్స్ ఏంటి, మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు, ప్లేయర్స్ ఫామ్ ఎలా ఉంది అన్న విషయాలు ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయన్న విషయం గుర్తుంచుకోండి. ఓ ప్లేయర్‌కు గతంలో చాలా ఘనమైన రికార్డు ఉందనో, లేదంటే ఎవరైనా ప్లేయర్ మీ ఫేవరెట్ అనో ఎంపిక చేస్తే మీకు నష్టం.
గత రికార్డుల కంటే క్రికెట్‌లో ఈ మధ్యకాలంలో ఫామే కీలకం. దీనికితోడు టీమ్ ఎంపికలో పిచ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందా లేక బౌలర్లకా.. ఒకవేళ బౌలర్లకైతే అది స్పిన్నర్లకా, పేసర్లకా అన్నది కూడా చూడాలి. పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టే క్రికెట్‌లో ఆయా టీమ్స్ తమ తుది జట్టును ప్రకటిస్తాయి. ఇక మ్యాచ్‌లో ఆడబోయే ప్లేయర్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. కొంత మంది ప్లేయర్స్ కొందరు ప్రత్యర్థులపై లేదంటే కొన్ని గ్రౌండ్స్‌లో బాగా ఆడతారు. అందుకే టీమ్ ఎంపిక చేసే సమయంలో ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
డబ్బంతా ఒకే మ్యాచ్‌పై.. పొరపాటు
డబ్బంతా ఒకే దగ్గర పెట్టుబడి పెట్టొద్దు. పెట్టుబడిని వివిధ రంగాలకు విస్తరించడం తెలివైన నిర్ణయం. బిజినెస్‌కు వర్తించే ఈ సూత్రం Dream 11 వంటి ఫ్యాంటసీ ప్లాట్‌ఫామ్స్‌కూ వర్తిస్తుంది. వీటిని ఆడేవాళ్లు చేసే పెద్ద తప్పు ఏంటంటే.. తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఒకే మ్యాచ్‌పై పెడుతుంటారు.
ముఖ్యంగా మొదట్లో ఒకటీ, రెండు మ్యాచ్‌లు గెలిచిన వాళ్లు ఈ పొరపాటు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటి మ్యాచ్‌లలో అదృష్టం వారివైపు లేకపోతే పెట్టిన డబ్బంతా పోతుంది. అందుకే డబ్బును ఒకే మ్యాచ్‌పై కాకుండా వివిధ మ్యాచ్‌లపై పెట్టడం ఉత్తమం. మీరు రూ. 100 పెట్టాలనుకుంటే.. దానిని ఐదు నుంచి పది మ్యాచ్‌లపై పెట్టండి. దీని ద్వారా కొన్ని మ్యాచ్‌లలో ఓడిపోయినా మీరు నష్టపోరు.
కెప్టెన్, వైస్ కెప్టెన్.. మార్చేది వీళ్లే
Dream 11 ఆడేవాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. సాధారణ ప్లేయర్స్ కంటే కెప్టెన్, వైస్ కెప్టెన్లకు ఎక్కువ పాయింట్లు ఉంటాయి. అందుకే ఈ ఇద్దరిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. బ్యాటర్లు, బౌలర్ల విషయంలో ఈ మధ్య కాలంలో ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే.. కెప్టెన్, వైస్ కెప్టెన్ల విషయంలో వాళ్లకు ఉన్న నైపుణ్యాలను పరిశీలించాలి.
అలా కాకుండా తాము ఎంపిక చేసిన టీమ్స్‌లో ఫేమస్ ప్లేయర్స్‌ను కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా చేసేస్తుంటారు. వీళ్ల విషయంలో రెట్టింపు పాయింట్లు వస్తాయి కాబట్టి.. ఒక్కోసారి ఎవరూ ఊహించని ప్లేయర్‌ను కెప్టెన్‌గా చేయడం బాగా కలిసి వస్తుంది. అందుకే సాంప్రదాయబద్దంగా కాకుండా వీళ్ల ఎంపిక విషయంలో కాస్త భిన్నంగా ఆలోచిస్తే మంచిది.
సంబంధిత కథనం