Harbhajan Singh on KL Rahul: రాహుల్ ఏం క్రైమ్ చేయలేదు.. వదిలేయండి.. వెంకటేష్ ప్రసాద్-ఆకాష్ చోప్రా డిబేట్‌పై భజ్జీ చురక
Harbhajan Singh on KL Rahul: కేఎల్ రాహుల్ ఫామ్ గురించి వెంకటేష్ ప్రసాద్-ఆకాష్ చోప్రా మధ్య హీటెడ్ డిబేట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ఎలాంటి క్రైమ్ చేయలేదని, అతడిని వదిలేయాలని ట్విటర్ వేదికగా తెలిపాడు.
Harbhajan Singh on KL Rahul: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ గురించి ప్రస్తుతం విపరీతంగా చర్చ జరుగుతోంది. అతడిని కొంతమంది సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే.. మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. భారత మాజీ ఆటగాళ్లు వెంకటేష్ ప్రసాద్, ఆకాష్ చోప్రా సైతం రాహుల్ గురించి భిన్న స్వరాలను ఉపయోగించారు. రాహుల్‌ను జట్టులో నుంచి తీసేయాలని వెంకటేష్ ప్రసాద్ అంటే.. రాహుల్‌ను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారంటూ వెంకటేష్ ప్రసాద్‌కు చురకలంటించాడు ఆకాష్. ప్రస్తుతం వీరి చర్చ ట్రెండింగ్‌గా మారింది. తాజాగా ఈ అంశంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. కేఎల్ రాహుల్‌ను ఒంటరిగా వదిలేయాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
"గయ్స్.. కేఎల్ రాహుల్‌ను కాస్త ఒంటరిగా వదిలేస్తారా? అతడు ఎలాంటి నేరము చేయలేదు. అతడు ఇప్పటికీ టాప్ ప్లేయరే. బలంగా పునరాగమనం చేస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మనమందరం ఆ దశను, అడ్డంకులను దాటుకుని వచ్చినవాళ్లమే. అతడే ఫస్ట్ కాదు.. లాస్ట్ కాదు. కాబట్టి రాహుల్‌ను గౌరవించండి. అతడు మన సొంత ఆటగాడనే వాస్తవాన్ని మరువకూడదు. కాబట్టి నమ్మకముంచండి." అని హర్భజన్ సింగ్ తన ట్విటర్ వేదికగా స్పందించాడు.
రాహుల్ సెలక్షన్ గురించి వెంకటేష్ ప్రసాద్ పదే పదే ట్విటర్ వేదికగా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. టెస్టు జట్టులో అతడిని తీసుకోవద్దని సూచించాడు. వీటిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. రాహుల్‌ను టార్గెట్ చేస్తూ ప్రసాద్ మాట్లాడుతున్నారని, అతడికి వ్యక్తిగత ఏజెండా ఉందోమోనని తన యూట్యూబ్ వీడియోలో స్పష్టం చేశాడు. దీనికి వెంకటేష్ ప్రసాద్ కూడా తనదైన శైలిలో రిప్లయి ఇచ్చాడు. రాహుల్‌పై తనకు ఎలాంటి ఏజెండా లేదని ఆకాష్‌కు చురకలంటించారు.
ఈ విషయంపై ఆకాష్ చోప్రా మరో ట్వీట్ చేస్తూ తన సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, సమస్య పరిష్కారానికి లైవ్ ఛాట్‌కు ఆహ్వానిస్తానని, అందులోకి రావాలని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ఇద్దరికి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చని, కానీ సరైన విధానంలో ఉండాలని సూచించారు. యూట్యూబ్‌లో తన మాటలు, వీడియోల వల్ల తనకు ఎలాంటి ప్రయోజనం లేదని, తన నెంబర్ మీ వద్ద ఉందని, అవసమైతే ఫోన్ చేయాలని ఆకాష్ చోప్రా తెలిపారు.
ఈ ట్వీట్‌కు వెంకటేష్ ప్రసాద్ కూడా స్పందించారు. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమి లేదు. నీ 12 నిమిషాల వీడియోలో నువ్వు నన్ను ఏజెండా పెడ్లర్‌గా అభివర్ణించావు. నువ్వు చెప్పేదానికి అది సూట్ కాదు. స్పష్టంగా అక్కడ ఉంది. ట్విటర్‌లో నా పాయింట్ క్లియర్‌గా చెప్పాను. ఈ విషయంపై మళ్లీ స్పందించాలని అడగవద్దు. అని వెంకటేష్ ప్రసాద్ తన ట్వీటర్‌లో పేర్కొన్నారు.
సంబంధిత కథనం