Harbhajan on India vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 4-0తో గెలుస్తుంది: హర్భజన్-harbhajan on india vs australia says india will whitewash the series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harbhajan On India Vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 4-0తో గెలుస్తుంది: హర్భజన్

Harbhajan on India vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 4-0తో గెలుస్తుంది: హర్భజన్

Hari Prasad S HT Telugu
Feb 22, 2023 09:13 PM IST

Harbhajan on India vs Australia: ఆస్ట్రేలియాపై ఇండియా 4-0తో గెలుస్తుందని అన్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. ఇప్పుడున్న ఆస్ట్రేలియా టీమ్ నకిలీదని అతడు అనడం విశేషం.

ఇండియన్ క్రికెట్ టీమ్
ఇండియన్ క్రికెట్ టీమ్ (AFP)

Harbhajan on India vs Australia: ఇప్పటికే నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఓడిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఈ సిరీస్ ను ఇండియా 4-0తో వైట్ వాష్ చేయడం ఖాయమని అతడు స్పష్టం చేశాడు. ఒకవేళ 10 మ్యాచ్ ల సిరీస్ అయినా కూడా ఇండియా గెలిచేస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

తొలి రెండు టెస్టుల్లో ఇండియా డామినేట్ చేసిన తీరు చూసి భజ్జీ ఇలా కామెంట్ చేశాడు. నంబర్ వన్ టెస్ట్ టీమ్ గా ఈ సిరీస్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా గట్టి పోటీ ఇస్తుందని భావించారు. కానీ రెండు టెస్టుల్లోనూ మూడు రోజుల్లోపే ఆ టీమ్ చేతులెత్తేసింది. ఆ టీమ్ ప్రదర్శన చూసిన తర్వాత హర్భజన్ స్పోర్ట్స్ తక్ తో మాట్లాడుతూ.. ఇది నకిలీ టీమ్ లా కనిపిస్తోందని అనడం గమనార్హం.

"ఆస్ట్రేలియా టీమ్ రవిచంద్రన్ అశ్విన్ డూప్లికేట్ తో ప్రాక్టీస్ చేసింది. కానీ ఈ ఆస్ట్రేలియా టీమే డూప్లికేట్ లా నాకనిపిస్తోంది. కేవలం నెగటివ్ విషయాలపైనే ఫోకస్ చేసేలా వాళ్ల మైండ్ సెట్ ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్ల ఎంత అయోమయంగా కనిపించారంటే తొలి బంతి పడకముందే మ్యాచ్ ఓడిపోయారు. ఈ టూర్ కోసం వాళ్లు అసలు సిద్దమైనట్లు లేదు. వాళ్లను చూస్తుంటే కేవలం ఔట్ కావడానికే ప్రాక్టీస్ చేసినట్లు ఉంది" అని భజ్జీ సెటైర్ వేశాడు.

ఇప్పుడు నడుస్తున్న సిరీస్ లో 10 మ్యాచ్ లు ఉన్నా కూడా అన్ని మ్యాచ్ లూ ఇండియా గెలుస్తుందని అన్నాడు. "ఇండియా 4-0తో గెలుస్తుందనడంలో సందేహం లేదు. ఇది పది మ్యాచ్ ల సిరీస్ అయినా.. ఇండియా 10-0తో ఆస్ట్రేలియాను ఓడిస్తుంది. ఈ ఆస్ట్రేలియా టీమ్ లో అసలు ఫైర్ పవర్ లేదు. పిచ్ కాస్త బౌలింగ్ కు అనుకూలిస్తే చాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచే వికెట్లు పారేసుకుంటారు" అని భజ్జీ అనడం విశేషం.

Whats_app_banner

సంబంధిత కథనం