Gambhir on Prithvi Shaw: వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో పృథ్వీ షానే ఓపెనింగ్ చేస్తాడు: గంభీర్-gambhir on prithvi shaw says he will open in 2024 t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gambhir On Prithvi Shaw Says He Will Open In 2024 T20 World Cup

Gambhir on Prithvi Shaw: వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో పృథ్వీ షానే ఓపెనింగ్ చేస్తాడు: గంభీర్

Hari Prasad S HT Telugu
Feb 01, 2023 03:38 PM IST

Gambhir on Prithvi Shaw: వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో పృథ్వీ షానే ఓపెనింగ్ చేస్తాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అనడం విశేషం. ఈ ఫార్మాట్ లో రోహిత్, విరాట్ లను పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తే పృథ్వీనే ఓపెనింగ్ కు ముందుంటాడని చెప్పడం విశేషం.

పృథ్వీ షా
పృథ్వీ షా (ANI)

Gambhir on Prithvi Shaw: టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షాపై మరోసారి ప్రశంసలు కురిపించాడు మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్. టీ20 ఫార్మాట్ లో అతనికి రెగ్యులర్ గా అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. అంతేకాదు వచ్చే టీ20 వరల్డ్ కప్ లో అతడే ఇండియన్ టీమ్ కు ఓపెనింగ్ చేస్తాడని కూడా జోస్యం చెప్పడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

పృథ్వీ షా జులై 2021లో ఇండియన్ టీమ్ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఇప్పటి వరకూ అతనికి మరో అవకాశం రాలేదు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ కోసం అతన్ని ఎంపిక చేసినా.. తొలి రెండు మ్యాచ్ లకు తుది జట్టులో చోటు ఇవ్వలేదు. ఈ రెండు మ్యాచ్ లలో గిల్, ఇషాన్ లకే అవకాశం ఇచ్చినా వాళ్లు విఫలమయ్యారు.

అయితే పదే పదే పృథ్వీ షాను పక్కన పెడుతుండటంపై గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "న్యూజిలాండ్ తో పృథ్వీ షాకు అవకాశం దక్కపోవడం మరోసారి ఆశ్చర్యం కలిగించింది. అతనికి అవకాశం ఇవ్వాలి. చాలా కాలం పాటు అతనికి మద్దతుగా నిలవాలి. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ లో. ఎందుకంటే ఒకవేళ సెలక్టర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను పక్కన పెట్టాలనుకుంటే 2024 వరల్డ్ కప్ లో పృథ్వీ షానే ఓపెనింగ్ చేస్తాడని నేను భావిస్తున్నా" అని గంభీర్ అన్నాడు.

గతేడాది పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 10 మ్యాచ్ లలో 332 రన్స్ చేశాడు. ఇక వన్డేల్లో రాణిస్తున్న శుభ్‌మన్ గిల్ ను టీ20ల్లోనూ కొనసాగిస్తుండటం సరి కాదని కూడా గంభీర్ అన్నాడు. వన్డేల్లో అతడు ఎంత బాగా రాణించినా.. టీ20లకు వచ్చే సరికి పృథ్వీ, ఇషాన్ లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేశాడు.

"కచ్చితంగా పృథ్వీ షా, ఇషాన్ కిషన్ లనే కొనసాగించాలి. మనం చాలా రోజులుగా మాట్లాడుకుంటున్నట్లుగా అలాంటి ఆటను ఈ ఇద్దరే ఆడగలరు. శుభ్‌మన్ గిల్ 50 ఓవర్ల ఫార్మాట్ లో నిజంగా చాలా బాగా ఆడాడు. కానీ టీ20ల విషయానికి వస్తే ఇప్పుడున్న టీమ్ లో పృథ్వీ షాకు మాత్రమే ఆ ఆట సహజంగా వస్తుంది" అని గంభీర్ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం