Messi vs Ronaldo: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ vs రొనాల్డో లేనట్లే-football news no messi vs ronaldo al nassr star not playing against inter miami ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Messi Vs Ronaldo: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ Vs రొనాల్డో లేనట్లే

Messi vs Ronaldo: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మెస్సీ vs రొనాల్డో లేనట్లే

Hari Prasad S HT Telugu
Jan 31, 2024 09:57 PM IST

Messi vs Ronaldo: ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన మెస్సీ, రొనాల్డో ఫైట్ జరగడం లేదు. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రి ఇంటర్ మియామీతో జరగాల్సిన మ్యాచ్ నుంచి అల్ నసర్ స్టార్ రొనాల్డో తప్పుకున్నాడు.

అల్ నసర్, ఇంటర్ మియామీ మ్యాచ్ లో మెస్సీ వెర్సెస్ రొనాల్డో లేనట్లే
అల్ నసర్, ఇంటర్ మియామీ మ్యాచ్ లో మెస్సీ వెర్సెస్ రొనాల్డో లేనట్లే

Messi vs Ronaldo: సమకాలీన ఫుట్‌బాల్ లో ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ అయిన లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తలపడుతుంటే చూడాలన్న అభిమానుల ఆశ నెరవేరడంలేదు. గురువారం (ఫిబ్రవరి 1) రాత్రి అల్ నసర్, ఇంటర్ మియామీ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ మ్యాచ్ నుంచి అల్ నసర్ స్టార్ రొనాల్డో తప్పుకున్నాడు. రియాద్ సీజన్ కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. గతేడాదే ఈ ఇద్దరు స్టార్లు ముఖాముఖి తలపడబోతున్నట్లు చెప్పినా అది సాధ్యం కావడం లేదు.

మెస్సీ, రొనాల్డో ఫేస్ టు ఫేస్ లేనట్లే

అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇంటర్ మియామీ క్లబ్ కు, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ క్లబ్ అల్ నసర్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. రియాద్ సీజన్ కప్ లో భాగంగా ఈ ఇంటర్ మియామీ, అల్ నసర్ టీమ్స్ ఫిబ్రవరి 1న తలపడబోతున్నట్లు గతేడాదే నిర్వాహకులు వెల్లడించారు. దీంతో మెస్సీ, రొనాల్డో ముఖాముఖి పోరు కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.

మెస్సీ, రొనాల్డో మధ్య లాస్ట్ డ్యాన్స్ ఇదే అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. ఏడాది కిందట ఈ ఇద్దరూ ఇక్కడే పీఎస్‌జీ, రియాద్ ఆల్ స్టార్స్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఫేస్ టు ఫేస్ తలపడ్డారు. ఇప్పుడు మరోసారి వీళ్ల ఫైట్ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

రొనాల్డోకు గాయం

ఈ కీలకమైన మ్యాచ్ నుంచి అల్ నసర్ స్టార్ రొనాల్డో తప్పుకున్నట్లు ఆ క్లబ్ వెల్లడించింది. ఈ స్టార్ ప్లేయర్ కు గాయమైంది. తనకు తప్పుడు సమయంలో ఈ గాయం అయినట్లు రొనాల్డో ఓ ప్రకటన కూడా ఇచ్చాడు. "నాకు చాలా బాధగా ఉంది. మీకు కూడా బాధ కలిగినట్లు నాకు తెలుసు.

కానీ ఇందులోనూ మనం మంచిని చూడాలి. మేము ఈ మ్యాచ్ ను రద్దు చేయలేదు. మ్యాచ్ జరగాలని అనుకున్నాం. మేము తిరిగి వస్తాం. నేను మీకోసం ఆడతాను. నేను బాధగా ఉన్నానని మీరు కూడా బాధపడకండి. ఓ ఫుట్‌బాల్ ప్లేయర్ పరిస్థితిని అర్థం చేసుకోండి" అని రొనాల్డో కోరాడు.

అటు అల్ నసర్ మేనేజర్ లూయిస్ క్యాస్ట్రో కూడా మెస్సీ, రొనాల్డో ముఖాముఖి లేదని తేల్చేశాడు. రొనాల్డో తన గాయం నుంచి కోలుకునే క్రమంలో చివరి దశలో ఉన్నాడని అతడు చెప్పాడు. త్వరలోనే జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడని తెలిపాడు. మరోవైపు రియాద్ సీజన్ కప్ లో తొలి మ్యాచ్ లో అల్ హిలాల్ చేతుల్లో ఓడిన ఇంటర్ మియామీ.. అల్ నసర్ పై గెలవాలని చూస్తోంది. రొనాల్డో లేకపోవడం ఆ టీమ్ కు కలిసి రావచ్చు.

మెస్సీ ఈ మధ్యే 2023 ఏడాదికిగాను ఫుట్‌బాల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అతనికి దక్కడం ఇది వరుసగా రెండో ఏడాది. గతేడాది అతడు రికార్డు స్థాయిలో 8వసారి బ్యాలన్ డోర్ అవార్డు కూడా అందుకున్నాడు.

Whats_app_banner