Neymar Saudi contract: మరో ఫుట్‌బాల్ స్టార్‌పై కోట్ల వర్షం కురిపించిన సౌదీ క్లబ్.. నెయ్‌మార్‌కు రాజయోగం-football news neymar saudi contract includes a lavish mansion ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neymar Saudi Contract: మరో ఫుట్‌బాల్ స్టార్‌పై కోట్ల వర్షం కురిపించిన సౌదీ క్లబ్.. నెయ్‌మార్‌కు రాజయోగం

Neymar Saudi contract: మరో ఫుట్‌బాల్ స్టార్‌పై కోట్ల వర్షం కురిపించిన సౌదీ క్లబ్.. నెయ్‌మార్‌కు రాజయోగం

Hari Prasad S HT Telugu
Aug 17, 2023 12:19 PM IST

Neymar Saudi contract: మరో ఫుట్‌బాల్ స్టార్‌పై కోట్ల వర్షం కురిపించింది సౌదీ క్లబ్. బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్‌కు రాజయోగం పట్టింది. భారీ ఫీజుతోపాటు సౌదీలో రాజభోగాలు అనుభవించనున్నాడు.

అల్ హిలాల్ క్లబ్ తో నెయ్‌మార్ ఒప్పందం
అల్ హిలాల్ క్లబ్ తో నెయ్‌మార్ ఒప్పందం (AFP)

Neymar Saudi contract: సౌదీ అరేబియాలోని క్లబ్స్ ప్రపంచంలోని టాప్ ఫుట్‌బాల్ స్టార్స్ పై కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్యే పోర్చుగల్ స్టార్ రొనాల్డోను భారీ ధరకు అక్కడి అల్ నసర్ క్లబ్ దక్కించుకోగా.. తాజాగా బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్ ను అల్ హిలాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఇన్నాళ్లూ పారిస్ సెయింట్-జెర్మేన్ (పీఎస్‌జీ)కి ఆడిన అతన్ని ఏకంగా 9 కోట్ల యూరోలు (సుమారు రూ.800 కోట్లు) చెల్లించింది.

yearly horoscope entry point

రెండేళ్ల పాటు నెయ్‌మార్ ఈ సౌదీ క్లబ్ అల్ హిలాల్ కు ఆడనున్నాడు. ఈ భారీ మొత్తంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా అతనికి లభించనున్నాయి. ప్రతి వారం 25 లక్షల పౌండ్ల (సుమారు రూ.25 కోట్లు) కాంట్రాక్ట్ కూడా కుదరడం విశేషం. తనకు మూడు లగ్జరీ కార్లు, నాలుగు మెర్సిడీస్ జీ వ్యాగన్లు, ఒక మెర్సిడీస్ వ్యాన్ కావాలని కూడా అల్ హిలాల్ క్లబ్ ను నెయ్‌మార్ అడగటం విశేషం.

ఈ లగ్జరీ కార్లలో బెంట్లీ కాంటినెంటల్ జీపీ, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్, లంబోర్ఘిని హురాకాన్ ఉన్నాయి. ఇక తన ప్రయాణాలు, హోటళ్లలో వసతి, రెస్టారెంట్ల ఖర్చులన్నీ కూడా అల్ హిలాల్ క్లబ్ భరించాలని కూడా నెయ్‌మార్ డిమాండ్ చేశాడట.

25 గదుల మ్యాన్షన్

ఇక సౌదీలో నెయ్‌మార్ కు అక్కడి క్లబ్ ఓ పెద్ద మ్యాన్షన్ కేటాయించడం విశేషం. అందులో 25 గదులు, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయని ది మిర్రర్ ఓ కథనాన్ని ప్రచురించింది. అల్ హిలాల్ క్లబ్ తో ప్రతి ఏటా నెయ్‌మార్ 17.31 కోట్ల పౌండ్లు (సుమారు రూ.1830 కోట్లు) సంపాదించనున్నాడు. రొనాల్డో, కరీమ్ బెంజిమా తర్వాత సౌదీ ప్రో లీగ్ లో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఫుట్‌బాలర్ గా నెయ్‌మార్ నిలిచాడు.

గతేడాది డిసెంబర్ లో రొనాల్డోతో ఒప్పందం కుదుర్చుకుంది అల్ నసర్ క్లబ్. ఇక మరో ప్లేయర్ బెంజిమా సౌదీ అరేబియా ఛాంపియన్స్ అల్ ఇత్తిహాద్ తో చేతులు కలిపాడు. 2017లో బార్సిలోనా వదిలి పీఎస్‌జీకి వెళ్లాడు నెయ్‌మార్. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన ఫుట్‌బాల్ స్టార్ గా అతడు నిలిచాడు. పీఎస్‌జీ తరఫున 173 మ్యాచ్ లలో 118 గోల్స్ చేశాడు.

Whats_app_banner

టాపిక్