Ipl Media Rights: ఐపీఎల్ మీడియా హక్కులు ఎవరికి దక్కాయంటే...
ఐపీఎల్ మీడియా హక్కుల అమ్మకం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ హక్కులను 44075 కోట్లకు వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు ఏవంటే...
ఐపీఎల్ మీడియా హక్కులు 44075 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన ఈ -వేలంలో పోటీపడి కార్పొరేట్ సంస్థలు హక్కుల ధరలను పెంచుకుంటూ పోయాయి. సోమవారం ముగిసిన వేలంలో టీవీ, డిజిటల్ హక్కులను భారీ ధరలకు వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి. ప్యాకేజీ ఏ క్రింద టీవీ హక్కులను 23575 కోట్లకు స్టార్ సంస్థ దక్కించుకున్నది.
ఒక్కో మ్యాచ్ కోసం డిస్నీ స్టార్ 57.5 కోట్లకుపైగా మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించనుంది. డిజిటల్ హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 సంస్థ 20500 కోట్లకు సొంతం చేసుకున్నది. ఒక్కో మ్యాచ్ కు 50 కోట్లు వెచ్చించనుంది. మొత్తంగా ఒక్కో మ్యాచ్ ద్వారా బీసీసీఐకి 107.5 కోట్ల ఆదాయం సమకూరనున్నది. 2023 నుండి 27 వరకు మొత్తం ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనున్నది.
మీడియా ప్రసార హక్కుల కోసం స్టార్, వయాకామ్ 18తో పాటు అమెజాన్, జీ గ్రూప్, యాపిల్, ఎమ్ ఎక్స్ ప్లేయర్, సోని వంటి దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డాయి. ఈ హక్కుల కోసం బీసీసీఐ 32 వేల కోట్లను కనీస ధరగా పేర్కొనగా 44 వేల కోట్లకు అమ్ముడుపోవడం చర్చనీయాంశంగా మారింది.
2017-22 వరకు మీడియా హక్కులను స్టార్ సంస్థ కేవలం 16438 కోట్లకు దక్కించుకున్నది. గతంతో పోలిస్తే మూడింతలు పెరగడం గమనార్హం.
సంబంధిత కథనం