Dinesh Karthik On Rohit Sharma: రోహిత్ శర్మ వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ - కెప్టెన్‌పై దినేష్ కార్తిక్ ప్రశంసలు
Dinesh Karthik On Rohit Sharma: మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనింగ్‌కు మారిన తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయిందని అన్నాడు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్. ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నాడని కార్తిక్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై దినేష్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు.
Dinesh Karthik On Rohit Sharma: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో సెంచరీతో అదరొట్టాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కీలక సమయంలో రాణించి సత్తా చాటాడు. టీమ్ ఇండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మపై టీమ్ ఇండియా వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ మాస్టర్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అని దినేష్ కార్తిక్ అన్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో చేసిన సెంచరీతో నాగ్‌పూర్‌లో మూడు ఫార్మెట్స్‌లో శతకం బాదిన క్రికెటర్‌గా రోహిత్ రికార్డ్ నెలకొల్పడం గొప్ప విషయమని కార్తిక్ చెప్పాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో అతడి యావరేజ్ కూడా 75కుపైనే ఉందని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్‌గా మారిన తర్వాత రోహిత్ బ్యాటింగ్ తీరు చాలా మారిందని పేర్కొన్నారు.
ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని రోహిత్ శర్మ పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా ప్రతి బౌలర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే నేర్పు రోహిత్ బ్యాటింగ్ శైలిలో కనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్‌లో అతడు ఎన్నో ఘనతల్ని సాధించాడు.
అతడి రికార్డులను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరూ వాటి గురించి మాట్లాడుకునే ఉంటున్నారు. అయినా ఓపెనర్‌గా అతడి దాహం తీరలేదనిపిస్తోంది. వైట్ బాల్ ఫార్మెట్‌లో రోహిత్ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని అనిపిస్తోందని దినేష్ కార్తిక్ పేర్కొన్నాడు. డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత స్వదేశంలో అత్యధిక యావరేజ్ కలిగిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు.