ChatGPT on KL Rahul: కేఎల్ రాహుల్‌ను టీమ్‌లో నుంచి తీసేయాలా.. చాట్‌జీపీటీ ఏం చెప్పిందో చూడండి
ChatGPT on KL Rahul: కేఎల్ రాహుల్‌ను టీమ్‌లో నుంచి తీసేయాలా? ఈ ప్రశ్నకు ఇప్పుడు సంచలనం రేపుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
ChatGPT on KL Rahul: ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ గురించి నడుస్తున్న చర్చ మరే ఇతర క్రికెటర్ గురించి జరగడం లేదు. అటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో చాట్‌జీపీటీ గురించీ అదే స్థాయిలో చర్చ నడుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆ కేఎల్ రాహుల్ గురించి ఈ చాట్‌జీపీటీని అడిగితే ఎలా ఉంటుంది? అదే ప్రయత్నం చేయగా.. ఈ ఏఐ నుంచి ఇంట్రెస్టింగ్ సమాధానం వచ్చింది.
రాహుల్ కొంతకాలంగా దారుణమైన ఫామ్ తో సతమతమవుతున్న సంగతి తెలుసు కదా. అతని గత పది టెస్టు ఇన్నింగ్స్ లు చూస్తే రాహుల్ ఎలాంటి దుస్థితిలో ఉన్నాడో స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అతన్ని టీమ్ లో నుంచి తీసేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ అంశంపైనే మాజీ క్రికెటర్లు వెంకటేశ్ ప్రసాద్, ఆకాశ్ చోప్రా మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది.
ఇలాంటి పరిస్థితుల్లో చాట్‌జీపీటీని అసలు రాహుల్ ను ఇండియన్ టీమ్ లో నుంచి తొలగించాలా అనే ప్రశ్న అడిగారు. దీనికి ఈ ఏఐ చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఈ చాట్‌జీపీటీ ఏమన్నదో తెలుసా?
"ఓ ఏఐ లాంగ్వేజ్ మోడల్ గా నాకు వ్యక్తులు లేదా జట్లపై ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలు లేదా పక్షపాతాలు లేవు. అయితే సాధారణ నిబంధనల ప్రకారం ఓ ప్లేయర్ ను టీమ్ లో నుంచి తొలగించడం అనేది ఈ మధ్యకాలంలో అతని ప్రదర్శన, ఫిట్‌నెస్ తోపాటు సదరు ప్లేయర్ నైపుణ్యం టీమ్ అవసరాలకు తగినట్లుగా ఉందా లేదా అన్నదానిపై ఆధారపడాలి.
కేఎల్ రాహుల్ ఈ మధ్య కాలంలో టెస్టుల్లో సరిగా రాణించకపోయి ఉంటే, టీమ్ లోని ఇతర ప్లేయర్స్ అతని స్థానంలో బాగా ఆడతారని అనుకుంటే టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని తొలగించడంపై నిర్ణయం తీసుకోవాలి. అయితే అతడు బాగా ఆడుతుంటే, అతని నైపుణ్యం టీమ్ కు అవసరమైతే మాత్రం అతడు జట్టులో ఉండాల్సిందే.
మొత్తంగా టీమ్ ఎంపిక నిర్ణయాలను టీమ్ మేనేజ్‌మెంటే తీసుకోవాలి. దీనికోసం ప్లేయర్ ఫామ్, ఫిట్‌నెస్, ఇతర వ్యూహాత్మక నిర్ణయాలు, పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది" అని చాట్‌జీపీటీ చెప్పడం విశేషం.
నిజానికి రాహుల్ వైస్ కెప్టెన్సీ పదవి ఇప్పటికే ఊడింది. దీంతో రానున్న రెండు టెస్టులకు అతనికి తుది జట్టులో చోటు దక్కడం కూడా అనుమానంగానే మారింది. రాహుల్ స్థానంలో శుభ్‌మన్ గిల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది.
సంబంధిత కథనం