Dhoni Candy Crush: ధోనీతోని అట్లుంట‌ది - క్యాండీ క్రాష్ స‌ర్వ‌ర్ క్రాష్-candy crush game trending once again after ms dhoni video viral ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Candy Crush Game Trending Once Again After Ms Dhoni Video Viral

Dhoni Candy Crush: ధోనీతోని అట్లుంట‌ది - క్యాండీ క్రాష్ స‌ర్వ‌ర్ క్రాష్

HT Telugu Desk HT Telugu
Jun 26, 2023 12:23 PM IST

Dhoni Candy Crush: ధోనీ దెబ్బ‌కు క్యాండీ క్రాష్ గేమ్ మ‌రోసారి పాపుల‌ర్‌గా మారింది. కేవ‌లం మూడు గంట‌ల్లోనే ముప్పైల‌క్ష‌ల మంది ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ధోనీ
ధోనీ

Dhoni Candy Crush: ధోనీ కార‌ణంగా క్యాండీ క్రాష్ గేమ్ స‌ర్వ‌ర్ క్రాష్ అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈ ఓల్డ్ గేమ్ మ‌రోసారి పాపుల‌ర్‌గా మారింది. ఆదివారం ధోనీ ఇండిగో ఫ్లైట్ ఏకాన‌మీ క్లాస్‌లో ప్ర‌యాణిస్తూ క‌నిపించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ధోనీకి ఎయిర్ హోస్టెస్ కొన్ని చాక్లెట్స్ అందిస్తూ ఈ వీడియోలో క‌నిపించింది. ఆ స‌మయంలోధోనీ క్యాండీ క్యాష్ గేమ్ ఆడుతోండ‌టం అభిమానుల‌ను కంట ప‌డింది.

ట్రెండింగ్ వార్తలు

ధోనీ కార‌ణంగా క్యాండీ క్రాష్ గేమ్ మ‌రోసారి ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. దాదాపు మూడు గంట‌ల్లోనే ముప్పై ల‌క్ష‌ల మంది క్యాండీ క్రాష్ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు గేమింగ్ నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు. ఈ గేమ్‌ను మ‌ళ్లీ తెగ ఆడేస్తోన్న‌ట్లు తెలిపారు. ఐపీఎల్ 2023లో బ్యాట్‌తో ఆక‌ట్టుకోలేక‌పోయినా త‌న కెప్టెన్సీతో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు మ‌రోసారి క‌ప్ అందించాడు ధోనీ.

అత‌డికి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఫైన‌ల్ ముగిసిన అనంత‌రం త‌న రిటైర్‌మెంట్‌పై స‌రైన టీమ్‌లో వెల్ల‌డిస్తాన‌ని ప్ర‌క‌టించి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ చేశాడు ధోనీ. చెన్నైలో ధోనీ ఆడిన ప్ర‌తి మ్యాచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు.

అత‌డి పేరుతో స్టేడియం ప‌లుమార్లు హోరేత్తిపోయిన సంగ‌తి తెలిసిందే. కాగా వ‌చ్చే సీజ‌న్‌లో ధోనీ ఆడే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే సీఎస్‌కే యాజ‌మాన్యం కూడా ధోనీ ఆడే అవ‌కాశం ఉందంటూ ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చారు. కాగా కెప్టెన్సీ ప‌ద‌వికి ధోనీ గుడ్‌బై చెప్పినా చైన్నై జ‌ట్టుతోనే అత‌డు కంటిన్యూ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ టీమ్‌కు మెంట‌ర్‌గా ధోనీ వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

WhatsApp channel

టాపిక్