Brian Lara: బ్రియాన్ లారా 501 రన్స్ రికార్డు కు నేటితో 28 ఏళ్లు…
సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో గొప్ప రికార్డులను నెలకొల్పాడు వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా. టెస్ట్ లతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్ గా బ్రియాన్ లారా పేరిట ఉన్న రికార్డు నేటికీ చెక్కు చెదరలేదు. 1994 లో డర్హమ్, వార్విక్ షైర్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్ లో లారా 501 రన్స్ చేశాడు. ఈ రికార్డు సాధించి నేటికి 28 ఏళ్లు పూర్తయ్యాయి.
అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్ మెన్ బ్రియాన్ లారా. టెస్టుల్లో 11 వేలు, వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్ట్ క్రికెట్ (400 రన్స్) ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో (501) అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడి బ్రియన్ లారా పేరిట ఉన్న రికార్డులు ఇప్పటివరకు బ్రేక్ కాలేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో లారా 501 పరుగులు రికార్డు సాధించి నేటికి 28 ఏళ్లు పూర్తయ్యాయి. 1994లో సరిగ్గా ఇదే రోజు ఈ రికార్డును లారా నెలకొల్పాడు. కౌంటీ క్రికెట్ లో భాగంగా డర్హమ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వార్విక్ షైర్ తరపున ఆడిన లారా ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన డర్హమ్ 158 ఓవర్లలో 556 పరుగులు చేసింది. డర్హమ్ బ్యాట్స్ మెన్స్ లో జాన్ మోరీస్ డబుల్ సెంచరీ (204 రన్స్) చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన వార్విక్ షైర్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అప్పుడు బ్యాటింగ్ దిగిన లారా 427 బాల్స్ లోనే 501 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. డర్హమ్ బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్ లో 62 ఫోర్లు, పది సిక్సర్లు ఉండటం గమనార్హం.
ఈ మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పాకిస్థాన్ మాజీ బ్యాట్స్ మెన్ హానీఫ్ మహ్మద్ (499 పరుగుల) అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును లారా అధిగమించాడు. లారా మెరుపు బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో వార్విక్ షైర్ 135 ఓవర్లలో నే 810 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన లారా రికార్డు మాత్రం క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది
టాపిక్