Indian Team For Wtc Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( డబ్ల్యూటీసీ )ఫైనల్ కోసం ఇండియన్ టీమ్‌ను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో రహానే కు స్థానం దక్కింది. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తిరిగి టీమ్ ఇండియాలో స్థానాన్ని దక్కించుకున్నాడు రహానే.
చివరగా గత ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు రహానే. ప్రస్తుతం ఐపీఎల్‌లో తన సహజ శైలికి భిన్నంగా ధనాధన్ ఇన్నింగ్స్‌లో ఆకట్టుకుంటున్నాడు. ప్రజెంట్ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపికచేసినట్లు తెలిసింది.
ఫామ్‌లేమితో ఇబ్బందులో పడుతోన్న కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచిన సెలెక్టర్లు అతడిని డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సెలెక్ట్ చేశారు. ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లను బీసీసీఐ ఎంపికచేసింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో విఫలమైన తెలుగు వికెట్ కీపర్ భరత్‌కు మరో అవకాశం ఇచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరుగనుంది.
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రహానే, అశ్విన్, జడేజా, షమీ, సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్