Bcci Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ - జడేజా, పాండ్యలకు ప్రమోషన్ -రాహుల్‌కు షాక్
Bcci Central Contract: 2022-23 ఏడాదికి గాను టీమ్ ఇండియా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో జడేజా, హార్దిక్ పాండ్య ప్రమోషన్స్ పొందగా కేఎల్ రాహుల్‌కు ఏ నుంచి బీ గ్రేడ్‌కు పడిపోయాడు.
Bcci Central Contract: 2022-23 ఏడాదికి గాను టీమ్ ఇండియా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ ఆదివారం అనౌన్స్‌చేసింది. నాలుగు గ్రేడ్స్‌లో కలిపి మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది.
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో అదరగొట్టిన జడేజాకు ప్రమోషన్ దక్కింది. ఏ ప్లస్ గ్రేడ్ ప్లేయర్‌గా జడేజా స్థానం సొంతం చేసుకున్నాడు. మరోవైపు గత కొంతకాలంగా వరుసగా విఫలమవుతోన్న కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏ గ్రేడ్ నుంచి అతడిని తొలగించి బీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అలాగే ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోషన్ పొందాడు.
ఏ గ్రేడ్ లో పంత్
రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఏ గ్రేడ్‌లో స్థానం నిలుపుకోగా వెన్ను గాయంతో ఐదారు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నా బుమ్రా కు ఏ ప్లస్ గ్రేడ్‌లో స్థానం పదిలం చేసుకున్నాడు.
గ్రేడ్‌ల వారిగా వార్షిక రెమ్యునరేషన్స్ ప్రకటించింది బీసీసీఐ. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడు కోట్లు, ఏ గ్రేడ్ ఆటగాళ్లకు ఐదు కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు 3 కోట్లు, సీ గ్రేడ్ క్రికెటర్స్‌కు కోటి రూపాయలుగా రిటైనర్‌షిప్ ఫీజును నిర్ణయించింది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకున్న ప్లేయర్స్ వీళ్లే
ఏప్లస్ గ్రేడ్
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, జడేజా
ఏ గ్రేడ్
హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషబ్ పంత్, అక్షర్ పటేల్
బీ గ్రేడ్
ఛటేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్
సీ గ్రేడ్
ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్ధూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్‌సింగ్, కేఎస్ భరత్