Argentina vs Netherlands: ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం.. నెదర్లాండ్స్‌కు గుండెకోత
Argentina vs Netherlands: ఫిఫా ప్రపంచకప్‌లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన నెదర్లాండ్స్‌తో జరిగిన క్వార్టర్స్‌లో అర్జెంటీనా అద్భుతమే చేసింది. చివరి వరకు పట్టు విడువకుండా ఆడి 2-2(4-3) ఫెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించింది.
Argentina vs Netherlands: ఆరంభంలోనే తన ముందు పసి కూన లాంటి జట్టుపై ఓటమి.. అతి కష్టం మీద నాకౌట్ దశకు.. నరాలు తెగే ఉత్కంఠ క్షణాల నడుమ సెమీస్ బెర్తు.. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా ప్రయణామిది. గ్రూప్ మ్యాచ్‌ల్లోనే సౌదీ అరేబియా చేతిలో కంగుతిన్న మెస్సీ జట్టు.. అతికష్టం మీద నాకౌట్ దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాపై సునాయ విజయం సాధించిన అర్జెంటీనా.. తాజాగా క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌పై పైచేయి సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెనాల్టీ షూటౌట్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మెర్టినెజ్ చివరి గోల్‌ను అద్భుతంగా ఆపి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ ఆరంభం నుంచి అర్జెంటీనానే ఆధిపత్యం చెలాయించింది. లియోనల్ మెస్సీ అసిస్ట్ సహాయంతో గోల్స్ సాధించి అర్జెంటీనాను 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. సెకాండాఫ్‌లో ఆలస్యంగా నెదర్లాండ్స్ ఆటగాళ్లు గోల్ సాధించారు. డచ్ ప్లేయర్ వౌట్ వేగోస్ట్ రెండో గోల్స్ కొట్టి జట్టును 2-2 తేడాతో రేసులో నిలిపాడు. స్కోర్లు సమం కావడంతో అదనపు సమయం అవసరమైంది. అయితే ఎక్స్‌ట్రా సమయంంలోనూ ఎలాంటి గోల్ నమోదు కాకపోవడంతో ఫెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.
ఉత్కంఠను రేపుతూ నాటకీయంగా షూటౌట్..
అదనపు సమయంలో రెండు జట్లు కూడా గోల్స్ చేయలేకపోయాయి. దీంతో ఫెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ కూడా అత్యంత నాటకీయంగా, ఉత్కంఠను రేపింది. మొదట నెదర్లాండ్స్ ఆటగాడు వర్జిల్ వాన్ డిజ్స్ సంధించిన గోల్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్టినేజ్ ఆపాడు. ఆ తర్వాత అర్జెంటీనా స్టార్ మెస్సీ సింపుల్‌గా డచ్ గోల్ పోస్టులో గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా 1-0 తేడాతో ముందంజ వేసింది. అనంతరం నెదర్లాండ్స్ ప్రయత్నాన్ని ఎమిలియానో సమర్థవంతంగా ఆపాడు. అనంతరం అర్జెంటీనా మరో గోల్ చేయడంతో 2-0 తేడాతో ముందంలో నిలిచింది. మూడో ప్రయత్నంలో నెదర్లాండ్స్ గోల్ సాధించింది. అనంతరం అర్జెంటీనా థర్డ్ అటెంప్ట్‌లోనూ విజయం సాధించిన 3-1 తేడాతో ఆధిక్యం సాధించింది.
నాలుగో ప్రయత్నంలో నెదర్లాండ్స్ అదిరిపోయే గోల్ సాధించడం, అర్జెంటీనా విఫలం కావడంతో ఫలితం 3-2గా మారింది. ఐదో ప్రయత్నంలో నెదర్లాండ్స్ మరోసారి సత్తా చాటడంతో 3-3తో సమం చేసింది. అనంతరం కీలకమైన ఐదో ప్రయత్నంలో అర్జెంటీనా స్ట్రైకర్ డి జాంగ్ గోల్ చేయడంతో 4-3 తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అంతకుముందు బ్రెజిల్‌తో జరిగిన మరో క్వార్టర్స్‌లో క్రోయేషియా విజయం సాధించడంతో అర్జెంటీనా ఆ జట్టుతో సెమీస్‌లో తలపడనుంది.
సంబంధిత కథనం