Dhana trayodashi: ధన త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి-why is dhanteras celebrated know the correct date puja muhurta and what to do and what not to do on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhana Trayodashi: ధన త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి

Dhana trayodashi: ధన త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకోండి

Gunti Soundarya HT Telugu
Oct 15, 2024 07:00 AM IST

Dhana trayodashi: ఐదు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దీపావళి పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. హిందూ ధర్మ శాస్త్రంలో ధన త్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఎవరి స్తోమతకు తగినట్టు వాళ్ళు కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటారు.

ధన త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి?
ధన త్రయోదశి రోజు ఎవరిని పూజించాలి?

హిందూ మతంలో ధన త్రయోదశి ఆశ్వయుజ మాసంలో వచ్చే త్రయోదశి రోజున జరుపుకుంటారు. ఈ రోజున ధన్వంతరి దేవత, యమధర్మరాజును పూజిస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం, వెండి పాత్రలతో సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. 

పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసంలో త్రయోదశి రోజున సముద్ర మథనం సమయంలో ధన్వంతరి దేవుడు చేతిలో అమృత పాత్రతో కనిపించాడు. ఐదు రోజుల పాటు జరిగే దీపాల పండుగ ధన త్రయోదశితో ప్రారంభమవుతుంది. సనాతన ధర్మంలో భగవంతుడు ధన్వంతరిని దేవతల వైద్యుడిగా, ఆయుర్వేద పితామహుడిగా పపిలుస్తారు. 

ధన త్రయోదశి రోజున ధన్వంతరిని పూజించడం వల్ల రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని నమ్ముతారు. ఈరోజు పలు శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ధన త్రయోదశి ఖచ్చితమైన తేదీ, షాపింగ్ శుభ సమయం, ఈ రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అని తెలుసుకుందాం. 

ధన త్రయోదశి ఎప్పుడు?

దృక్ పంచాంగ్ ప్రకారం త్రయోదశి తిథి 29 అక్టోబర్ 2024న ఉదయం 10:31 గంటలకు ప్రారంభమై 30 అక్టోబర్ 2024న మధ్యాహ్నం 01:15 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం 29 అక్టోబర్ 2024న ధన త్రయోదశి జరుపుకుంటారు.

పూజ ముహూర్తం

ప్రదోష కాలంలో ఈ పూజ నిర్వహిస్తారు. 29 అక్టోబర్ 2024న సాయంత్రం 06:31 నుండి రాత్రి 08:13 వరకు ధన త్రయోదశి పూజకు అనుకూలమైన సమయం.

ధన త్రయోదశి ఏం చేయాలి?

ధన త్రయోదశి రోజున భగవంతుడు ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, యమధర్మ రాజు, వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున బంగారం, వెండి, లోహం, కొత్తిమీర, చీపురు కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. కొత్తిమీర లక్ష్మీదేవికి ప్రతీకరమైనదని నమ్ముతారు. బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వచ్చి నివసిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున మృత్యు దేవుడైన యమధర్మ రాజుకు  ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని దానం చేస్తారు.

ధన త్రయోదశి రోజున ఇంటిని శుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖీర్, తెల్లని వస్త్రం మొదలైన వాటిని దానం చేయడం శ్రేయస్కరం. ధంతేరస్ సందర్భంగా కొత్త చీపురు కొని పూజిస్తారు. లక్ష్మీదేవి, కుబేరుడు సంతోషించి సంపద వర్షం కురిపిస్తారని నమ్ముతారు. 

ధన త్రయోదశిలో ఏమి చేయకూడదు?

ధన త్రయోదశి రోజున మాంసం, మద్యంతో సహా తామసిక ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. గృహోపకరణాలు అమ్మకూడదు, చవాన్ దానం చేయకూడదు. ఈ రోజున నలుపు రంగు బట్టలు లేదా వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి.

ధన త్రయోదశి రోజున ఇంట్లో ఏ మూలన చీకటి ఉండకూడదు. ఈ రోజున ఇంట్లోని ప్రతి మూలలో పరిశుభ్రత, మంచి వెలుతురుపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. రుణం ఇవ్వడం మానుకోవాలి.

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner