Lord ganesha nimajjanam: వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి? అందుకు అనుసరించాల్సిన పద్ధతి ఏంటి?
Lord ganesha nimajjanam: వినాయకుడి విగ్రహ ప్రతిష్ట, నిమజ్జన రెండూ కూడా శుభ ముహూర్తంలోనే జరుగుతాయి. గణేశుడిని ఇంటికి తీసుకువచ్చిన అదే ఆనందం, ఉత్సాహంతో వీడ్కోలు పలకాలని నమ్ముతారు. బాధగా ఎప్పుడూ వినాయకుడికి వీడ్కోలు పలకడం మంచిది కాదని అంటారు.
Lord ganesha nimajjanam: భారతదేశంలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ 10 రోజుల పండుగ ఆటంకాలు తొలగించే గణేశుడికి అంకితం చేయబడింది. మత విశ్వాసాల ప్రకారం అనంత చతుర్దశి రోజున గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.
వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ఏ విధంగా అయితే శుభ సమయం చూసుకుంటామో అదే విధంగా నిమజ్జనం చేసేటప్పుడు కూడా సరైన ఆచారాలు పాటించాలి. కొంతమంది మూడు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుతారు. అయితే శాస్త్రం ప్రకారం అనంత చతుర్థశి రోజు వినాయకుడి నిమజ్జనం చేయాలి.
గణేశుడిని ఇంటికి తీసుకువచ్చిన అదే ఆనందం, ఉత్సాహంతో వీడ్కోలు పలకాలని నమ్ముతారు. వెళ్ళిరా బొజ్జ గణపయ్య అంటూ ఆనందంగా వీడ్కోలు పలకాలి. మళ్ళీ వచ్చే ఏడాది మరింత ప్రేమ, ఆనందం, సంతోషం, ఆశీర్వాదాలు తీసుకురమ్మని కోరుకుంటూ జై భోలో గణేష్ మహరాజ్ కి జై అని అంటూ నిమజ్జనం చేస్తారు. డబ్బులు వాయించుకుంటూ, నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. గణేష్ నిమజ్జనం సరైన పద్ధతిని తెలుసుకుందాం-
గణేష్ ని ఎప్పుడు నిమజ్జనం చేస్తారు?
పంచాంగం ప్రకారం అనంత చతుర్దశి సెప్టెంబర్ 16 మధ్యాహ్నం ప్రారంభమై సెప్టెంబర్ 17 మధ్యాహ్నం ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం అనంత చతుర్దశి తిథి సెప్టెంబర్ 17న చెల్లుతుంది. ఈ రోజున బప్పాకు వీడ్కోలు పలుకుతారు. ఈ రోజున గణపతి నిమజ్జనానికి 4 పవిత్రమైన చోఘడియ ముహూర్తాలు ఉంటాయి. ఈ శుభ సమయాల్లో గణపతి బప్పను నిమజ్జనం చేయడం శుభప్రదం.
గణేష్ నిమజ్జనానికి అనుకూలమైన సమయం
చతుర్దశి తిథి ప్రారంభం - సెప్టెంబర్ 16, 2024 15:10
చతుర్దశి తిథి ముగుస్తుంది - సెప్టెంబర్ 17, 2024 రాత్రి 11:44 గంటలకు
ప్రథమ ముహూర్తం (చర, లాభ్, అమృత్) - 09:11 నుండి 13:47 వరకు
మధ్యాహ్నం ముహూర్తం (శుభం) - 15:19 నుండి 16:51 వరకు
సాయంత్రం ముహూర్తం (లాభం) - 19:51 నుండి 21:19 వరకు
రాత్రి ముహూర్తం (శుభ్, అమృత్, చార్) - 22:47 నుండి 03:12 వరకు,సెప్టెంబర్ 18
గణేష్ నిమజ్జనం విధానం
ఉదయాన్నే లేచి స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేయండి. వినాయకుడికి అభిషేకం నిర్వహించాలి. అనంతరం పసుపు చందనాన్ని స్వామికి పూయండి. పుష్పాలు, అక్షత, దుర్వ, పండ్లు సమర్పించండి.
ధూపం వేసి, నెయ్యి దీపంతో ఆరతి చేయండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకం సమర్పించండి. ఆచారానుసారం పూజ నిర్వహించాలి. చివరిలో క్షమాపణ కోసం ప్రార్థించండి. పూజ పూర్తి అయిన తర్వాత గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలి. శుభ సమయంలో విగ్రహాన్ని నిమజ్జనానికి నది లేదా చెరువు వంటి నీరు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లాలి. విగ్రహాన్ని అమాంతం నీటిలో విసిరేయకుండా జాగ్రత్తగా జారవిడచాలి. వచ్చే ఏడాది వారిని మళ్లీ ఇంటికి సంతోషాన్ని తీసుకురమ్మని కోరుకుంటూ బై బై గణేశా చెప్పాలి.