సనాతన ధర్మంలో దీపం వెలిగించడానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి?
ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజ చేస్తారు. సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆంతర్యం గురించి ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
దీపం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక చిహ్నం. దీపాన్ని వెలిగించడం మన పూజా విధానంలో ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తారు. దీపం ప్రకాశం మాత్రమే కాకుండా దైవిక చైతన్యం, జ్ఞానాన్ని సూచిస్తుంది.
దీపం వెలిగించడం అనేది ఒక సాంప్రదాయం మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మికతను కూడా మనం అవగాహన చేసుకోవాలి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
"దీపం జ్యోతి పరబ్రహ్మ" అని పిలువబడే మంత్రం దీపానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. దీపం అంటే జ్యోతి (ప్రకాశం), అది పరబ్రహ్మ స్వరూపమైనదని చెప్పబడింది. ఈ శ్లోకం ద్వారా మనం అనేక సంకేతాలను గ్రహించవచ్చు:
దీపం జ్యోతి పరబ్రహ్మా
దీపం సర్వతమోఘ్నం
దీపేన సాథ్యం యానంతరం
సర్వమంగళం ప్రదీపమే।
ఈ శ్లోకం ప్రకారం దీపం పరబ్రహ్మను ప్రతిబింబిస్తుంది. అంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రశాంతత, జ్ఞాన మార్గానికి సూచన చేస్తుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా భక్తులు తమ మనసులోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించడానికి ప్రయత్నిస్తారు. దీపం సర్వతమోఘ్నం అని అంటే చీకటిని తొలగించగలదు అని అర్థం. అజ్ఞానం, అశాంతి, అహంకారం వంటి చీకట్లను తొలగించే ఈ ప్రకాశం భగవంతుని రూపానికి ప్రతీక అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
దీపం ప్రాముఖ్యత
అజ్ఞానాన్ని తొలగిస్తుంది: దీపం వెలిగించడం అంటే చీకటిని నాశనం చేయడం, జ్ఞానాన్ని సంపాదించడం. చీకటి అంటే అజ్ఞానం, దుర్భావనలను సూచిస్తుంది. దీపం మనకు విజ్ఞానం, మానసిక స్పష్టత, సద్గుణాల మార్గంలో నడిపిస్తుంది.
పరబ్రహ్మ స్వరూపం: దీపం పరబ్రహ్మ రూపంలో పూజింపబడుతుంది. దీని అర్థం దేవుడిని ప్రత్యక్షంగా దర్శించడం కాకపోయినా, ఆయన ఉనికిని ఈ దీపం ద్వారా గ్రహించవచ్చు. దీపం ఒకటే కాకుండా సర్వవ్యాప్తిని, పరమేశ్వరుని ఉనికిని సూచిస్తుంది.
పూజల్లో దీపం ప్రాముఖ్యత: పూజల్లో దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైన అంశం. ఇది దేవతల శక్తిని ఆహ్వానించడానికి, పూజల సమయంలో సత్కారాన్ని తెలిపేందుకు ఉపయోగపడుతుంది. ప్రతి పూజకు ముందు, శుభకార్యాలకు ముందు దీపం వెలిగించడం ద్వారా శుభం చేకూరుతుందని హిందూ ధర్మం చెబుతుంది.
దీపం వెలిగించడం అంటే జీవితం శక్తితో నిండి ఉందని అర్థం. దీపం వెలిగించి పూజ చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం కోరుతారు.
తమస్సు నాశనం: చీకటి అంటే తమస్సు. దీపం అంటే ప్రకాశం, తమస్సును తొలగించేది. అజ్ఞానపు చీకటిలో ఉండి కష్టాలు పడే మనిషిని ఈ దీపం జ్ఞాన మార్గంలో నడిపిస్తుంది.
దీపారాధన సాంప్రదాయాలు
ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం: దీపం ఉదయం, సాయంత్రం అనేది సాంప్రదాయంగా పాటించబడుతుంది. ఉదయానికి వెలిగించే దీపం మానసిక ప్రశాంతత, ఉత్సాహం కలిగిస్తుంది. సాయంత్రం వెలిగించే దీపం ధార్మికత, కట్టుబాట్లతో మనిషిని ప్రభావితం చేస్తుంది.
దేవాలయాల్లో దీపారాధన: చాలా ఆలయాల్లో ప్రతిరోజూ ఈ దీపారాధన ప్రత్యేక పూజగా జరుగుతుంది. దీపాన్ని వెలిగించడం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక దారి సుస్థిరం చేసుకుంటారు అని చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ తెలిపారు.
దీపం మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్గదర్శక ప్రబలమైన చిహ్నం. దీపం ప్రకాశం ద్వారా మన ఆంతరంగిక చీకట్లు తొలగిపోతాయి, మన ఆత్మ ప్రక్షాళన అవుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్