Telugu News  /  Rasi Phalalu  /  Weekly Horoscope Telugu, Aries To Pisces Weekly Forecast For October 2 To 8, 2022
Weekly Horoscope Telugu
Weekly Horoscope Telugu (stock pic)

Weekly Horoscope Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారు జాగ్రత్త!

02 October 2022, 7:38 ISTHT Telugu Desk
02 October 2022, 7:38 IST

Weekly Horoscope Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు, అక్టోబర్ 02 నుంచి అక్టోబర్ 08, 2022 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి.

Weekly Horoscope Telugu : తెలుగు రాశి ఫలాలు (వార ఫలితము)

ట్రెండింగ్ వార్తలు

02.10.2022 నుండి 08.10.2022 వరకు

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: ఆశ్వయుజం

మేష రాశి :

మేషరాశి వారికి ఈ వారం మధ్యస్తం నుండి అనుకూల ఫలితాలున్నవి. వ్యవస్థానములో గురుని ప్రభావం చేత ఆర్ధిక విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. జన్మ రాహువు ప్రభావం వలన చికాలు, ఒత్తిడులు అధికముగా ఉండును. ధన స్థానము నందు కుజుని సంచారం వలన దూకుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములో చికాకులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అధికముగా ఉండును. అయినప్పటికి ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించెదరు. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు మధ్యస్త ఫలితములు, వ్యాపారస్తులకు ధన వ్యయం కలుగును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితములు ఈ వారం గోచరిస్తున్నవి. మేషరాశివారు మరింత శుభ ఫలితం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంగళవారం పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగును.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. లాభస్థానము నందు గురుని సంచారము చేత అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. వ్యయ స్థానము నందు రాహువు సంచారము వలన ఖర్చులు పెరుగును. జన్మరాశి యందు కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయము నందు జాగ్రత్త వహించాలి. ఒత్తిడులు అధికమగును. మిగిలిన గ్రహాల అనుకూల స్థితి వలన సుఖ భోజన ప్రాప్తి, బంధుమిత్రలు ప్రశంసలు, ఆనందము కలుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి. దుర్గాష్టకము దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగును.

మిథున రాశి :

మిథునరాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం వలన ఆందోళన, ఇబ్బందులు కలుగును. వ్యాపారము ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన కుటుంబ సౌఖ్యము మరియు ధన లాభము కలుగును. వ్యయస్థానములో కుజుని ప్రభావంచేత ఆవేశపూరిత నిర్ణయాలు మరియు వృధా ఖర్చులు పెరుగును. మానసిక ఉల్లాసము కొరకు ధనమును ఖర్చు చేసెదరు. మృష్టాన్న భోజనము, సౌఖ్యము కలుగును. శని వక్రియై సంచరించుట వలన చికాకులు అధికముగా ఉండును. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిధునరాశి వారు బుధవారం రోజు మహా విష్ణువును పూజించి, విష్ణు సహస్రనామాన్ని పఠించవలెను. అలాగే దశరథ శని ప్రోక్త స్తోత్రాన్ని శనివారం పఠించడం మంచిది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తం నుండి అనుకూలంగా ఉన్నది. చతుర్గ స్థానమునందు కేతువు సంచారము వలన స్త్రీలతో ఇబ్బందులు ఏర్పడును. శని వక్రియై సంచరించుట వలన కుటుంబము నందు కొన్ని సమస్యలు బాధించును. గురు, కుజ మరియు రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును. కుటుంబములో ఉన్న సమస్యలు తొలగును. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్ళటం మంచిది. కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అష్టమ గురుని ప్రభావము చేత సింహరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు చికాకులు అధికముగా ఉండును. ద్వితీయ స్థానములో రవి, బుధుల సంచారము వలన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, నూతనంగా వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. అష్టమ గురుని యొక్క ప్రభావము వలన కుటుంబ వ్యవహారాల యందు మరియు ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. వ్యాపారస్తుల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కలిగించును. విద్యార్థులకు కష్టపడాల్సినటువంటి సమయం. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్త ఫలితము ఉన్నది. జన్మరాశి రవి సంచరించుట వల్ల వత్తిళ్ళు అధికముగా ఉండును. శారీరక శ్రమ ఏర్పడును. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికి మనోధైర్యంతో ముందుకు వెళ్ళి విజయము పొందెదరు. శని మరియు గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు. ప్రయాణములు అధికమగును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :

తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. అష్టమ కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయాల యందు మరియు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వ్యవహరించడం మంచిది. శత్రువులతో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు కేతువు అష్టమ స్థానము నందు కుజుడు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన తులారాశి వారికి ఉద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడి మరియు శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు కలుగును. వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికమగును. విద్యార్థులకు మధ్య ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. అప్పుల ఒత్తిడి ఉండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడటం మంచిది. ఖర్చులు పెరుగును. ఆర్భాటాలకు దూరంగా ఉండటం మంచిది. శని అనుకూల ప్రభావముచేత మరియు పంచమ స్థానము గురువు, ఆరవ స్థానము రాహువు ప్రభావము చేత అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. సమాజము నందు కీర్తి కుటుంబము నందు గౌరవము పెరుగును. లాభము రవి ప్రభావము చేత ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకమైన సమయము. ధనలాభము మరియు కుటుంబ సౌఖ్యము కలుగును. సోదరులు మరియు పిల్లల వలన చికాకులు కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనలాభము కలుగును. శత్రువులు మిత్రులుగా వ్యవహరించెదరు. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనూ రాశి :

ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితములు ఉన్నవి. కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము కలుగును. సమాజము నందు కీర్తి కలుగును. లాభ స్థానము నందు కేతువు, దశమ స్థానము నందు రవి, బుధులు భాగ్యం నందు శుక్రుని సంచారము వలన అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని సంచారము వలన ఏలినాటి ప్రభావము చేత ఆర్ధిక సమస్యలు మరియు పనుల యందు ఆలస్యము ఏర్పడును. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించటం చేయాలి.

మకర రాశి :

మకర రాశి వారికి ఈ వారం మధ్యస్తముగా ఉన్నది. చికాకులు అధికముగా ఉండును. శారీరక శ్రమ పెరుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మరాశి యందు శని వక్రియై సంచరించుట వలన అలాగే తృతీయము నందు గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. పంచమమునందు గురుడు, భాగ్యమునందు రవి బుధుల అనుకూలత వలన మీయొక్క కృషితో పట్టుదలతో ముందుకు వెళ్ళి కార్యములు పూర్తి చెసేదరు. ఉద్యోగస్తులకు కష్ట సమయము. వ్యాపారస్తులకు చెడు సమయము. చికాకులు అధికముగా ఉండును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అష్టమ రవి, శుక్ర, బుధ ప్రభావం చేత మానసిక ఒత్తిళ్ళు మరియు బాధలు అధికమగును. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు వహించాలి. కుటుంబములో చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. ధనవ్యయము ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టును. అప్పు చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహస్థితి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును. ఉద్యోగస్తులకు కష్టకాలము. వ్యాపారస్తులకు అనుకూలంగా లేనటువంటి సమయము. ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం వంటివి చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్తముగా ఉన్నది. జన్మరాశి యందు గురుని ప్రభావం చేత మీన రాశివారికి ఆరోగ్య సమస్యలు మరియు ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని విజయవంతముగా పూర్తి చేసెదరు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. మీనరాశి వారు గురువారం రోజు శనగలు మరియు తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్ 9494981000.

టాపిక్