Vastu Tips : ఇంట్లో ఆ వస్తువులను.. ఆ ప్లేస్లో పెడితే.. ఆర్థికంగా కలిసి వస్తుందట
Vastu Tips : మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు.. కొన్ని విషయాలు పాటించడంలో తప్పులేదు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడరు అంటుంది వాస్తు శాస్త్రం. ఇంతకీ ఆ వస్తువులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips : కొందరికి నెల చివరికి రాకముందే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఎంత కష్టపడినా డబ్బు తమ దగ్గర ఉండట్లేదని బాధపడుతూ ఉంటారు. ఎంత సేవింగ్ చేయాలి అనుకున్నా.. ఖర్చులు తగ్గించుకున్నా.. డబ్బు మాత్రం మిగలదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవి ఏంటో.. వాటిని వాస్తుకు అనుకూలంగా ఎలా ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న కొబ్బరి
చిన్న కొబ్బరిని శ్రీఫల్ అని కూడా అంటారు. సాధారణ కొబ్బరితో పోలిస్తే ఈ కొబ్బరికాయ చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ చిన్న కొబ్బరికాయలు పెట్టే ఇళ్లలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదంటున్నారు. ఇది మీకు ఆర్థిక పరంగా ప్రయోజనాలను అందించడమే కాకుండా.. వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చేలా చేస్తుంది.
మెటల్ తాబేలు
చాలా మంది తమ ఇళ్లలో వెండి, ఇత్తడి లేదా కాంస్య తాబేలును ఉంచుకుంటారు. తాబేలును విష్ణువు అవతారంగా భావిస్తారు. తాబేలును ఉంచుకోవడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయని చెబుతారు. ఆర్థిక శ్రేయస్సు కోసం తాబేలును ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉంచండి.
పిరమిడ్
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పిరమిడ్ ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. క్రిస్టల్ పిరమిడ్ ఉన్న ఇల్లు, దాని సభ్యుల ఆదాయం వేగంగా పెరుగుతుందని చెబుతారు. దీనితో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా అభివృద్ధి చెందుతుంది.
గోమతీ చక్రం
గోమతీ చక్రాన్ని గ్రంధాలలో చాలా పవిత్రమైనదిగా వర్ణించారు. గోమతి చక్రము గోమతి నదిలో చక్రం ఆకారంలో కనిపించే రాయి. ఈ చక్రాన్ని ఇంట్లో ఉంచడం ద్వారా.. ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి, ఆర్థిక శ్రేయస్సు పొందుతారు. ఎవరి నుంచి చెడు దృష్టి ఉండదు. 11 గోమతి చక్రాలను పసుపు వస్త్రంలో చుట్టి.. వాటిని ఒక ఖజానాలో ఉంచడం వల్ల లక్ష్మి మాత ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
తామరగింజలు
మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉంటే తామర గింజల మాల తెచ్చి మీ ఇంటి గుడిలో ఉంచండి. ఈ దండతో డబ్బు వచ్చే మార్గం తెరుచుకుంటుంది అంటారు. ఈ మాలతో 108 సార్లు మీ అధిష్టాన దేవత పేరును జపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
* పై వాటిని హిందూస్థాన్ టైమ్స్ తెలుగు ధృవీకరించట్లేదు. మెరుగైన ఫలితాల కోసం మీ జ్యోతిష్యుడిని సంప్రదించండి.
సంబంధిత కథనం