అక్టోబర్ 12, నేటి రాశి ఫలాలు- విజయదశమి రోజు పన్నెండు రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి-today vijaya dasami 2024 rasi phalalu in telugu check zodiac wise horoscope results ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 12, నేటి రాశి ఫలాలు- విజయదశమి రోజు పన్నెండు రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి

అక్టోబర్ 12, నేటి రాశి ఫలాలు- విజయదశమి రోజు పన్నెండు రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి

HT Telugu Desk HT Telugu
Oct 12, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ12.10.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 12 నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 12 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 12.10.2024

వారం: శ‌నివారం, తిథి న‌వ‌మి,

నక్షత్రం: శ్రవణం, మాసం : ఆశ్వయుజము ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

మనోనిర్మలత, భార్య, సంతానంవలన శుభాశయాలు నెరవేరుతాయి. స్థిరాస్తుల వృద్ధి, అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. సర్వ కార్యములయందు అనుకూలత ఉంది. శరీర సౌఖ్యం ఉంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృషభం

పని ఒత్తిడి వలన కుటుంబసభ్యులతో సరియైన సమయం గడప లేకపోతారు. విందు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. సంఘంలో గౌరవంపెరుగుతుంది. స‌న్నిహితుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి.

మిథునం

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళకు ఈరోజు ఉద్యోగ జీవితంలో సమస్యలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారస్తులకు అధికారుల ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. ఉదర సంబంధ రుగ్మతలు ఎదురయ్యే అవ‌కాశం ఉంది. ఈ సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారు.

కర్కాటకం

ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకోలేక పోతారు. అహంకారానికి గురి అవుతారు. అబద్ధాలు ఆడ‌వ‌ల‌సి రావ‌చ్చు. స్వయం నిర్ణయాధికారాన్ని కోల్పోవడం వంటివి జరుగుతాయి.

సింహం

వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అందరి నుంచి మంచి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు. తోబుట్టువుల నుండి అనుకూల వాతావరణం ల‌భిస్తుంది. పిల్లల విషయాలు కూడా సంతోషాన్ని మరియు శుభవార్తను అందిస్తాయి.

కన్య

ఆత్మ విమర్శ చేసుకుని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. శత్రువులను విస్మరించడం మంచిది.

తుల

మిత్రులతో ఆనందంగా గడిపే సమయం ఇది. కుటుంబంలో వంశోద్ధారకులు ఆవిర్భవిస్తారు. గృహంలో మంగళతోరణాలకు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమతుల్యత, ఆర్థిక వికాసం కల్గుతుంది.

వృశ్చికం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణాలు కలసి వస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తిలో లాభం, అఖండైశ్వర్యాలు కలుగుతాయి.

ధనుస్సు

ధైర్యం, ప్రణాళిక, పట్టుదలతో కార్యసిద్ధి కలుగుతుంది. అన్నిరకాల ప్రయత్నాలలోనూ జయం కలుగుతుంది. ఎంతటి కార్యాన్నైనా సులువుగా సాధిస్తారు. మంచివక్తగా పేరు తెచ్చుకుంటారు.

మకరం

ప్రారంభంలో అధిక ఖర్చులు. ముక్కు, గొంతు, చెవి వైద్యుల సహాయం అవసరమవుతుంది. వస్త్రాలు, నిత్యకృత్య అవసరాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన లాభాలు వరిస్తాయి. శత్రువుల జాబితా కూడా పెరిగే అవకాశం ఉంది.

కుంభం

మీ సామాజికస్థితి పెరుగుతుంది. విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తారు. పిల్లల వ్యవహారాలు కూడా సజావుగా సాగుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకునే సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు.

మీనం

నేటి రాశి ఫలాల ప్రకారం మీన రాశి వారికి ఈరోజు మానసిక వేదన, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుజుడి అర్ధాష్టమ సంచార ప్రభావాన్ని అధిగమించేందుకు సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. కొత్త ప్రణాళికకు దూరంగా ఉండండి. ఇతరులపై పగను కల్గి ఉంటే ప్రశాంతంగా జీవించలేం.

అందించిన వారు: ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 

 

Whats_app_banner