అక్టోబర్ 1, నేటి రాశి ఫలాలు-ఈరోజు ఈ రాశి వాళ్ళు ఇంట్లో, వ్యాపారంలో బిజీగా ఉంటారు
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ01.10.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 01.10.2024
వారం: మంగళవారం, తిథి: చతుర్దశి,
నక్షత్రం: పూర్వ ఫల్గుణి, మాసం: భాద్రపదము,
సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
ప్రతి ఒక్క అంశం గురించి అవగాహన కలిగి ఉంటారు. అత్తగారి తరపు బంధువులతో విసిగి పోతారు. దూర ప్రాంత ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. కుటుంబంలో కొత్త వ్యక్తులకు ఆహ్వానం పలుకుతారు. ఇది నూతన ఉత్సాహానికి కారణమవుతుంది.
వృషభం
ఆహార, పానీయాల పట్ల అధిక శ్రద్ధ కనబరుస్తారు. విదేశీ ఉత్పత్తుల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు. తల్లిదండ్రులకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తారు. గోమతి చక్రాలతో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి.
మిథునం
నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు ఈరోజు ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ నిమిషం తీరిక లేకుండా గడుపుతారు. ప్రతి ఒక్క పని మీరే చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కింది స్థాయి ఉద్యోగులతో సతమతమవుతారు, సమస్యలు ఏర్పడతాయి. ప్రత్యేకించి మహిళలతో మీకు అసంతృప్తి కలుగుతుంది. లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం మంచిది.
కర్కాటకం
స్నేహితుల వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు తాత్కాలికంగా విరమించుకుంటారు. సామాజిక దృక్పథంతో ఆశ్రమాలకు, ఓల్డేజ్ హోంలకు విరాళాలు అందజేస్తారు. పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఎరుపు వత్తులు, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. బ్యాంక్ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.
సింహం
మీరు పడుతున్న కష్టాన్ని, శ్రమని అయినవాళ్ల కన్నా బయటివాళ్లు ఎక్కువగా గుర్తించి మిమ్మల్ని ఆదరిస్తారు. ఎంతగానో ప్రోత్సహిస్తారు. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో దైవికం పొడి, సాంబ్రాణితో ధూపం వేయండి, నరదృష్టి తొలగిపోతుంది. మానసిక ఉత్తేజం కలిగి ఉంటారు. జీవిత ఆశయాన్ని సాధించే ప్రయత్నాల్లో అత్యంత చేరువ అవుతారు.
కన్య
ఎన్నో రోజులుగా నేర్చుకోవాలని ఉబలాటపడుతున్న విషయాలు ఇప్పుడు నేర్చుకోగలుగుతారు. తద్వారా మానసిక తృప్తి కలిగి ఉంటారు. క్రీడా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉపకరిస్తాయి. పెద్ద సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్వయంకృతాపరాధాలు దొర్లే అవకాశముంది.
తుల
చిన్న చిన్న సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు, లివర్ సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలున్నాయి. నిర్లక్ష్యం చేయకండి. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. వృత్తిరీత్యా అదనపు బాధ్యతలను మోయాల్సి వస్తుంది.
వృశ్చికం
చేదోడు వాదోడుగా మీకు అండగా ఉంటారని కొంతమంది వ్యక్తులను చేరదీస్తారు. వాళ్లకి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. మంచితనంతో మీరు చేసిన ఈ పనికి వక్రభాష్యాలు అంటగట్టేవారు తారసపడతారు. మీ వ్యక్తిత్వం తెలిసిన వాళ్లు కూడా ఈ రకమైన నిందలు వేయడం మీకు అసహనం కలిగిస్తుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి.
ధనుస్సు
వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించండి. రాజకీయాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. కొంత మంది ద్వారా పైవాళ్లతో పైరవీలు జరిపిస్తారు. కొన్ని సదవకాశాలను దక్కించుకుంటారు.
మకరం
శత్రువర్గాన్ని పూర్తిగా నిర్మూలించ లేకపోయినప్పటికీ పక్కకి పారదోల గలుగుతారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు అయినవాళ్లు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు ముందుగానే గ్రహిస్తారు. ఎంతో చాకచక్యంగా, సమయస్ఫూర్తితో నెమ్మదిగా, హుందాగా వ్యవహరిస్తారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. మీ సొంతవాళ్లే మీ ప్రవర్తనా తీరులో వచ్చిన మార్పుకి ఆశ్చర్యపోతారు.
కుంభం
నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు కోపతాపాలకు బానిస కాకుండా ఓర్పుతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ అభివృద్ధికి కారణమవుతాయి. పునాదులుగా మారతాయి. శుభ కార్య వ్యవహారాలలో ఘన విజయం సాధిస్తారు. కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన నుదుట దానిని నుదుట ధరించండి.
మీనం
మీ కష్ట సుఖాలను గుర్తించలేని వారిని మీరు కూడా వద్దనుకుంటారు. ప్రయోజనాలు దక్కకపోయినప్పటికీ ఇలాంటి వ్యక్తులతో మనకి సావాసం అవసరం లేదన్నట్టుగా ఆలోచనలు ఏర్పడతాయి. కోర్టు తీర్పులు అంతంత మాత్రంగా ఉంటాయి. వాయిదాల రూపంలో ఈ విషయాలు ఎన్నో నష్టాలకు కారణమవుతాయి. పూజలో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.