Planet transit: మూడు గ్రహాల సంచారం- ఈ 3 రాశుల వారికి ఎటు చూసినా డబ్బే డబ్బు-three major planet transit in september month these zodiac signs get full money luck ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Transit: మూడు గ్రహాల సంచారం- ఈ 3 రాశుల వారికి ఎటు చూసినా డబ్బే డబ్బు

Planet transit: మూడు గ్రహాల సంచారం- ఈ 3 రాశుల వారికి ఎటు చూసినా డబ్బే డబ్బు

Gunti Soundarya HT Telugu
Sep 11, 2024 07:11 PM IST

Planet transit: సెప్టెంబర్ నెలలో మూడు పెద్ద గ్రహాల సంచారం జరగబోతుంది. దీని ప్రభావం మూడు రాశుల మీద బాగా ఉంటుంది. అప్పుల నుంచి బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

మూడు గ్రహాల సంచారం
మూడు గ్రహాల సంచారం

Planet transit: కొన్ని గ్రహాలు ప్రతి నెల రాశులను మారుస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మొత్తం పన్నెండు రాశుల మీద ఉంటుంది. గ్రహాల కదలిక విషయంలో సెప్టెంబర్ నెల చాలా కీలకంగా మారింది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు వంటి పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి.

తిరోగమన, అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు సెప్టెంబర్ 4న సింహ రాశిలోకి ప్రవేశించాడు. తర్వాత సెప్టెంబర్ 16న గ్రహాల రాజు సూర్యుడు రాత్రి 07:29 గంటలకు కన్యా రాశి ప్రవేశం చేస్తాడు. చివరగా శుక్రుడు సెప్టెంబర్ 18 మధ్యాహ్నం మధ్యాహ్నం 01:41 గంటలకు తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 23 సెప్టెంబర్ 2024న బుధుడు మళ్లీ సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఈ మూడు పెద్ద గ్రహాల సంచార వల్ల సెప్టెంబర్ 2024 నెల కొన్ని రాశిచక్రాల వారికి చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. వ్యాపారం, వృత్తిలో కూడా లాభాలను పొందుతారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మూడు గ్రహాలు కలిసి కన్యా రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పరుస్తాయి. అది మాత్రమే కాకుండా బుధుడు భద్ర మహా పురుష రాజయోగం, శుక్రుడు మాలవ్య రాజయోగం, సూర్యుడు బుధుడు కలిసి బుద్ధాదిత్య యోగం ఇస్తారు. మూడు గ్రహాల సంచారం వల్ల ప్రయోజనాలు పొందే రాశులు ఏవో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి సెప్టెంబర్ 2024 నెల చాలా శుభప్రదమైనది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. కూరుకుపోయిన అప్పుల నుంచి బయటపడతారు. ఈ కాలంలో లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో పురోగతిని చూస్తారు. మంచి ఉద్యోగ ప్రతిపాదన వస్తుంది. కార్యాలయాలలో సహోద్యోగుల నుండి పూర్తి సహాయం అందుతుంది. పని తీరు బాగా మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వారు తమ కోసం కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహ రాశి

సెప్టెంబర్ 2024 నెల సింహ రాశి వారికి చాలా అనుకూలమైనదిగా ఉంటుంది. ఈ రాశి పన్నెండవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడబోతుంది. డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఊహించని విధంగా డబ్బులు చేతికి అందుతూనే ఉంటాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు దొరుకుతాయి. కొత్త వ్యూహాలు అనుసరించి లాభాలు గడిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశిలో లగ్న గృహంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం మారాలనే కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల నుండి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి లేదా వాహనం మొదలైనవి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మతపరమైన లేదా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. ఇది వారికి ఆనందం, సంతృప్తిని ఇస్తుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.